Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌లో ఈ జంట నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి. ఈ ఎంగేజ్‌మెంట్ రూమర్స్‌పై ఇప్పటివరకు విజయ్‌తో పాటు రష్మిక క్లారిటీ ఇవ్వలేదు. ఔనని చెప్పలేదు. కాదని సమాధానం ఇవ్వడం లేదు. ది గర్ల్‌ఫ్రెండ్ ప్రమెషన్స్‌లో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకున్నది రష్మిక మందన్న.
కాగా విజయ్‌తో పెళ్లిపై ఓ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఇప్పటివరకు మీరు పనిచేసిన యాక్టర్స్‌లో ఎవరిని పెళ్లిచేసుకుంటారు? ఎవరితో డేట్‌కు వెళతారని రష్మికను అభిమానులు అడిగారు. విజయ్ దేవరకొండను పెళ్లిచేసుకుంటానని రష్మిక మందన్న సమాధానం చెప్పింది. నరుటో (జపాన్ యానిమేషన్ క్యారెక్టర్)తో డేటింగ్ చేస్తానని బదులిచ్చింది. ఈ ఈవెంట్‌తో మరోసారి విజయ్‌తో తన పెళ్లిని రష్మిక కన్ఫామ్ చేసిందని అభిమానులు చెబుతోన్నారు.
కాగా ఇదే ఈవెంట్‌లో తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి వెల్లడించింది రష్మిక మందన్న. “నన్ను బాగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నాతో కలిసి లేదా నా కోసం యుద్ధం చేసేవాడై ఉండాలి. భవిష్యత్తులో నాపై ఏదైనా యుద్ధం వస్తే.. నాతో కలిసి పోరాడుతాడనే నమ్మకం కలగాలి. అలాంటి వ్యక్తి దొరికితే అతడి కోసం నేను ఎంత దూరమైనా వెళతాను. అవసరమైతే అతడి కోసం యుద్ధంలో బుల్లెట్‌కు (తూటా) ఎదురువెళతాను” అని రష్మిక మందన్న బదులిచ్చింది. రష్మిక మందన్న కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి డేట్ ఫిక్సైనట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మికల పెళ్లి జరుగనుందని అంటున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లిపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఓ తెలుగు సినిమా చేస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విజయ్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది. గతంలో గీతగోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.
మరోవైపు రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ శుక్రవారం ప్రేక్షక్షకుల ముందుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు వస్తున్నాయి.
Also Read – Ananya Panday: జెన్ జీ పై ఫరా ఖాన్, ట్వింకిల్ కౌంటర్స్.. సపోర్ట్‌గా మాట్లాడిన అనన్య పాండే


