Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna: రష్మికని ఆపేదెవరు..?

Rashmika Mandanna: రష్మికని ఆపేదెవరు..?

Rashmika Mandanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. అటు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఆమె పుష్ప 2 తర్వాత నుంచి వరుస సినిమాలకు సైన్ చేస్తూ, సౌత్ అండ్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే ఆమె ‘కుబేర’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. సౌత్ లో తెలుగు, తమిళ సినిమాలను ఒప్పుకుంటున్న రష్మిక హిందీలో కూడా భారీ బడ్జెట్ సినిమాలను కమిటవుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే రష్మిక మందన్న ‘మైసా’ అనే కొత్త సినిమాను కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే, రష్మిక నటిస్తున్న ‘థామా’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకూ, ఈ నేషనల్ క్రష్.. ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించగా, మొదటిసారి ఈ సినిమాతో భయపెట్టడానికి సిద్ధమవుతుంది. తాజాగా, రష్మిక నటిస్తున్న ‘థామా’ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో రష్మిక ‘తడాఖా’ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

Also Read – University Paper Leak : ఆర్. నారాయణమూర్తి ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ చిత్రం.. హాస్య బ్రహ్మా ఏమన్నారంటే!

ఇక ఆదిత్య సర్పోత్దార్.. ఈ హర్రర్ చిత్రానికి దర్శకత్వం వహించగా, మాడాక్స్ ఫిలిమ్స్.. దినేష్ విజన్ ప్రజెంట్ బ్యానర్ పై.. అమర్ కౌశిక్, దినేష్ విజయం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్ నటిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రష్మిక మందన్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఈ మూవీతో పాటు రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది.

ప్రస్తుతం రష్మిక మందన్న నే మిగతా హీరోయిన్స్ కంటే టాప్ పొజిషన్ లో ఉంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు గ్లామర్ రోల్స్ కి, కమర్షియల్ సినిమాలకి సైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు ఏ భాషలోనైనా అందరికీ కావాల్సిన హీరోయిన్ రష్మిక మందన్ననే. కెరీర్ ప్రారంభం నుంచి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. కథల ఎంపికలో రష్మిక ప్లానింగ్ అంతా.. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంచుకున్న సినిమా హిట్ అవుతూ ఉండటం బాగా కలిసొచ్చింది. ఇప్పట్లో రష్మికని బీట్ చేసే హీరోయిన్ ఎవరూ కనిపించడం లేదు.

Also Read – Anushka: అనుష్క కోసం రంగంలోకి ప్ర‌భాస్ – ఘాటి ప్ర‌మోష‌న్స్‌లో రెబెల్‌స్టార్ – గ‌ట్టిగానే ప్లాన్ చేశారుగా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad