Rashmika Mandanna: తమిళంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హారర్ ఫ్రాంచైజ్‌గా కాంచన నిలిచింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన నాలుగు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కాంచన సిరీస్‌లో ఐదో మూవీ రాబోతుంది. కాంచన 4 పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో లారెన్స్ హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
వంద కోట్ల వ్యయం…
కాంచన సిరీస్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా దాదాపు వంద కోట్ల వ్యయంతో కాంచన 4 రూపొందుతోంది. ఈ హారర్ మూవీలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోండగా… బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ మూవీలో కథను మలుపు తిప్పే మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందట. ఈ పాత్ర కోసం పాన్ ఇండియన్ లెవెల్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం అన్వేషించిన మేకర్స్ చివరకు రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్లు కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి.
Also Read – Kajal Aggarwal:మాల్దీవుల్లో పిచ్చెక్కిస్తున్న చందమామ!
రోల్ లెంగ్త్ తక్కువే కానీ…
కాంచన 4లో రష్మిక మందన్న రోల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర చుట్టే కథ మొత్తం సాగుతుందట. రోల్ లెంగ్త్ తక్కువే అయినా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రష్మిక ఈ మూవీలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతోన్నారు. కాంచన గత సిరీస్‌లలో కూడా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను బలంగా డిజైన్ చేసుకున్నారు లారెన్స్. వాటికి మించి కాంచన 4 ఉంటుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రష్మిక మందన్న కాంచన 4 సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది.
దక్షిణాదిలో ఫస్ట్ మూవీ…
దక్షిణాదిలో రష్మిక మందన్న నటిస్తున్న ఫస్ట్ హారర్ మూవీ. ఓవరాల్‌గా ఇది సెకండ్ సినిమా. ప్రస్తుతం బాలీవుడ్‌లో థామా పేరుతో ఓ హారర్ మూవీ చేస్తోంది రష్మిక మందన్న. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహిస్తున్న ఈ బాలీవుడ్ మూవీ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థామా మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా కనిపించబోతున్నాడు. మలైకా ఆరోరా, నోరా ఫతేహి స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు.
తెలుగులో… బాలీవుడ్‌లో..
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో రష్మిక మందన్న వరుస సక్సెస్‌లతో దూసుకుపోతుంది. హిందీలో యానిమల్, ఛావా సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ పరంగా రికార్డులను తిరగరాశాయి. తెలుగులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన పుష్ప 2 మూవీ 1800 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ప్రస్తుతం తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు మైసా సినిమాలు చేస్తుంది.
Also Read – NTR: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సుహాసినీ క్లారిటీ


