Mysaa: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా రష్మిక మందన్న పేరు ఎక్కువగా వినిపిస్తుంది. రెండు ఇండస్ట్రీలలో టాప్ స్టార్‌గా కొనసాగుతోంది. ఓ వైపు స్టార్ హీరోలతో జోడీ కడుతూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది.
ఇటీవలే తెలుగులో మైసా పేరుతో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీని మొదలుపెట్టింది రష్మిక మందన్న. ఫస్ట్ టైమ్ పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో రష్మిక కనిపించబోతున్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై నెలాఖరు నుంచి మైసా మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. జెట్ స్పీడ్‌లో రష్మిక ఈ సినిమాను పూర్తి చేస్తోందట. ఇప్పటికే మైసా మూవీ షూటింగ్ యాభై శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. రష్మిక స్పీడును చూసి యూనిట్ సభ్యులు సైతం షాకైనట్లు సమాచారం.
దీపావళికి ట్రీట్…
ఈ దీపావళికి మైసా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ గ్లింప్స్ ఉంటుందని అంటున్నారు. ఈ గ్లింప్స్‌లో రష్మిక విశ్వరూపాన్ని చూస్తారని అంటున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్నను కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమాగా మైసా నిలవనుందని చెబుతున్నారు. గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో హై యాక్షన్ థ్రిల్లర్‌గా మైసా రూపొందుతోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో ఐదు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
Also Read – Actress Regina: బోల్డ్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న రెజీనా
పెళ్లి కోసం బ్రేక్…
మరోవైపు విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగింది. ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి కోసం రెండు, మూడు నెలల పాటు సినిమాలకు రష్మిక మందన్న బ్రేక్ తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఆ లోపు అంగీకరించిన సినిమాల షూటింగ్‌లను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో రష్మిక మందన్న ఉన్నట్లు సమాచారం. అందుకు సినిమాల స్పీడు పెంచినట్లు సమాచారం.
థామా రిలీజ్…
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ థామా దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది. హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తోన్నాడు. తెలుగులో రష్మిక హీరోయిన్‌గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబోయే భర్త విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది రష్మిక మందన్న. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది.
Also Read – Dil Raju: బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు – దిల్‌రాజు పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా?


