Rashmika Mandanna: రష్మిక మందన్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ థామా దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కెరీర్‌లో ఫస్ట టైమ్ రష్మిక చేసిన హారర్ మూవీ ఇది.మాడాక్ హారర్ కామెడీ యూనివర్సలో భాగంగా తెరకెక్కుతోన్న థామాపై బాలీవుడ్‌లో భారీగానే ఎక్స్‌పెక్టెషన్స్ ఉన్నాయి. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన స్త్రీ, ముంజ్యా, స్త్రీ 2 సినిమాలు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్నాయి. థామా కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు. రష్మిక మందన్నకు దక్షిణాదిన ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాకు స్పెషల్ అడ్వాంటేజ్‌గా మారింది. తెలుగులో భారీ స్థాయిలో థామా రిలీజ్ అవుతోంది.
హీరోతో సమానంగా…
కాగా థామా కోసం రష్మిక మందన్న హీరో ఆయుష్మాన్ ఖురానాతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ హారర్ మూవీ కోసం ఆయుష్మాన్ ఖురానా పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. హీరోకు ఏ మాత్రం తగ్గకుండా రష్మిక మందన్న కూడా 8 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ అందుకున్నట్లు చెబుతున్నారు. యానిమల్, ఛావా సక్సెస్‌లతో బాలీవుడ్‌లో రష్మిక మందన్న క్రేజ్ డబుల్ అయ్యింది. ఈ సక్సెస్‌లతో రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు సమాచారం. మరోవైపు దక్షిణాదిలో అగ్ర నాయికగా కొనసాగుతోంది. పాన్ ఇండియన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రష్మిక గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె అడిగినంత మొత్తాన్ని మేకర్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
Also Read: IND vs AUS:భారత్- ఆస్ట్రేలియా హైవోల్టేజ్ పోరు నేడే.. మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
థామా మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తుండగా… సత్యరాజ్, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థామాలో మలైకా ఆరోరా స్పెషల్ సాంగ్ చేసింది. వరుణ్ ధావన్, నోరా ఫతేహి గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం థామాతో పాటు బాలీవుడ్‌లో కాక్ టెయిల్ 2 కూడా చేస్తోంది రష్మిక మందన్న. 2012లో సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా నటించిన కాక్ టెయిల్ మూవీకి సీక్వెల్‌గా కాక్ టెయిల్ 2 రూపొందుతోంది. మరోవైపు తెలుగులో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కాబోయే భర్త విజయ్ దేవరకొండతో ఓ హిస్టారికల్ మూవీలో నటిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కథాంశంతో చేస్తోన్న మైసా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
Also Read: Google Pixel 10 Discount: గూగుల్ పిక్సెల్ 10పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఎంతంటే..?


