Rashmika Mandanna: రష్మిక పేరు ఎక్కడ వినిపించినా అందరూ విజయ్ దేవరకొండ పేరును కూడా కలగలిపే వింటున్నారు. అంతలా ట్రెండ్ అవుతున్నాయి వారిద్దరి పేర్లు. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందనే వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచీ మామూలుగా లేదు మేనియా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లకు రష్మిక హాజరైనప్పుడు విజయ్ దేవరకొండకు సంబంధించి, నిశ్చితార్థానికి సంబంధించి, ఆమె చేతికున్న ఉంగరానికి సంబంధించి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నిటికీ చాకచక్యంగా సమాధానాలిచ్చారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
ప్రజలు అనుకునేది, వాళ్ల మనసు చెబుతున్న నిజమేనంటూ చిన్నగా హింట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. రింగ్ తనకు చాలా స్పెషల్ అని కూడా అన్నారు రష్మిక. ఇదంతా ఓ ఎత్తు. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లు మరో ఎత్తు. లేటెస్ట్‌గా సోషల్ మీడియా వేదికగా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లు సాగాయి.
Also Read- Bro Sequel: బ్రో మూవీకి సీక్వెల్ – పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ కాంబో సెట్టయ్యిందా?
‘నాకు తెలుసు.. వాళ్లు చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని చెప్పారు. చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. జీర్ణించుకోవడానికి కఠినమైన అంశాన్ని చెప్పారు. ఈ సినిమాలో నటించిన వారి నటన టాప్ క్లాస్‌లో ఉంది. రష్మిక, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయల్‌తో రాహుల్ తీసిన ది గర్ల్ ఫ్రెండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్‌ని థియేటర్లలో చూడండి. దీని గురించి ఆలోచించండి’ అంటూ ది గర్ల్ ఫ్రెండ్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. దీనికి అంతే ఆత్మీయంగా సమాధానమిచ్చారు రష్మిక మందన్న.
‘ఇది చాలా పవర్‌ఫుల్. చాలా కీలకమైంది. జీర్ణించుకోవడానికి కఠినతరమైనది.. అని చాలా బాగా చెప్పారు. థాంక్యూ’ అంటూ లవ్ ఎమోజీలను పోస్ట్ చేశారు రష్మిక మందన్న. స్లో బర్న్ అయినా ఎక్కువ కాలం ఉంటుందని ఆమె ట్వీట్ చేశారు. అక్కడి వరకు మామూలుగానే అనిపించినా.. ఆమె పోస్టులో ఆ తర్వాత ఉన్న లైన్లు మాత్రం జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాలో మొదటి నుంచీ ఇన్ డైరెక్ట్‌గా పార్ట్ అయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో తన నటనకు తప్పకుండా ఫిదా అవుతారని, తన పనితీరుకు విజయ్ గర్వపడతారని ఆమె పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
Also Read- Rashmika Mandanna: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ
లైనుకో లవ్ ఎమోజీని రష్మిక ప్లేస్ చేసిన తీరు కూడా నెటిజన్లకు వావ్ ఫ్యాక్టర్ అవుతోంది. ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ అనే రోజులు పోయి.. నిశ్చితార్థం జరిగి.. ఫిబ్రవరిలో పెళ్లికి రెడీ అవుతున్నారనే టాక్ కూడా మరోసారి స్పీడందుకుంది. సిల్వర్ స్క్రీన్ మీద మెస్మరైజ్ చేసిన ఈ జంట త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారనే మాట ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. త్వరలోనే వీరిద్దరూ కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద కూడా హల్‌చల్ చేయనున్నారు.
It IS something powerful. It IS something important. It IS going to be hard to digest – So well put! ❤️
Thankyou ❤️It’s a SLOW BURN that LASTS LONG.
❤️@TheDeverakonda you’ve indirectly been a part of this film since the beginning and I really hope that you’ll be proud of me… https://t.co/DJCZb2zWZz— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025
ప్రస్తుతానికి ది గర్ల్ ఫ్రెండ్‌కి వస్తున్న రివ్యూలతో హ్యాపీగా ఉన్నారు రష్మిక మందన్న. టాక్సిక్ రిలేషన్ షిప్స్ అమ్మాయిలకు ఎలా గుదిబండగా మారుతాయనే విషయాన్ని ఈ మూవీలో డీల్ చేశారు రాహుల్ రవీంద్రన్. డైరక్షన్ చేయడమే కాదు, ప్రొఫెసర్‌గానూ నటించారు రాహుల్ రవీంద్రన్.


