నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. తాజాగా ‘పుష్ఫ2′(Pushpa2) మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సౌత్ నుంచి నార్త్ వరకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకు సారీ చెప్పారు. తాను థియేటర్‌లో చూసిన విజయ్ నటించిన ‘గిల్లి’ చూశానని.. అందుకే విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే ‘గిల్లి’ మూవీ తెలుగు ‘పోకిరి’ సినిమాకు రీమేక్ అని రష్మిక పొరపాటు పడ్డారు. అంతే సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
తాజాగా ఈ ట్రోల్స్‌పై రష్మిక తనదైన శైలిలో స్పందించారు. “అవును తెలుసు.. సారీ. గిల్లి సినిమా ఒక్కడు రీమేక్ అని ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది. పోకిరి మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ వైరల్ అయ్యాయి. సారీ.. సారీ.. మై బ్యాడ్. కానీ నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే” అని తెలుగులో క్లారిటీ ఇచ్చారు.