Rashmika Mandanna: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాను రష్మిక మందన్నా ఆడియెన్స్‌తో కలిసి చూసిందట. అది కూడా హైదరాబాద్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో. అయితే తనను ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషంలో థియేటర్‌లకు వెళ్లి రష్మిక మందన్న ఈ సినిమా చూసిందట. ఈ విషయాన్ని కింగ్డమ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ బయటపెట్టారు.
సెక్యూరిటీ రీజన్స్ వల్ల…
కింగ్డమ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో కలిసి సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న కింగ్డమ్ సినిమా చూసిన విషయాన్ని బయటపెట్టారు నాగవంశీ. విజయ్ దేవరకొండకు రష్మిక మందన్న పెద్ద ఫ్యాన్. కింగ్డమ్ సినిమాను శ్రీరాములు థియేటర్‌లో చూడాలని రష్మిక మందన్న అనుకున్నది. కానీ సెక్యూరిటీ రిజన్స్ వల్ల కుదరలేదు. దాంతో కామన్ మ్యాన్‌లా మారువేషంలో భ్రమరాంబ థియేటర్‌కు వెళ్లిన రష్మిక మందన్న ఈ సినిమా చూసింది. రష్మిక సినిమా చూసిన విషయం తను చెప్పే వరకు మాకు ఎవరికి తెలియదు అని నాగవంశీ అన్నారు. రష్మికను ఉద్దేశించి నాగవంశీ చేసిన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుడ్‌న్యూస్ ఎప్పుడు…
ఇదే ఇంటర్వ్యూలో రష్మికతో ప్రేమాయణంపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు. గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతున్నారని అడిగిన ప్రశ్నకు కింగ్డమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేయనివ్వండి అంటూ సమాధానం దాటవేశారు. విజయ్ ఆన్సర్ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read- Biggboss Telugu 9: బిగ్‌బాస్ 9 లాంఛ్ డేట్ ఇదే – ఏడో సారి హోస్ట్‌గా నాగార్జున – కంటెస్టెంట్స్ ఫిక్స్!
మనం కొట్టినం…
కింగ్డమ్ రిలీజ్ రోజు మనం కొట్టినం అంటూ రష్మిక మందన్న ఎమోషనల్ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్‌కు విజయ్ రిప్లై కూడా ఇచ్చాడు. రిలీజ్‌కు ముందు కూడా కింగ్డమ్ ట్రైలర్, టీజర్‌తో పాటు ప్రతి అప్‌డేట్‌కు రష్మిక రియాక్ట్ అవుతూ వచ్చింది. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రేమ పెళ్లి వార్తలను వీరిద్దరు ఇప్పటివరకు అఫీషియల్‌గా కన్ఫామ్ చేయలేదు.
రాహుల్ సాంకృత్యాన్ మూవీలో…
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడోసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కింగ్డమ్ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో విజయ్ రష్మిక కాంబినేషన్‌లో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి. త్వరలోనే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Also Read- 71st National Awards: 71వ జాతీయ అవార్డులను ప్రకటించిన కేంద్రం


