The Girlfriend: ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ సెన్సార్‌తో పాటు ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ వస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. అను ఇమ్మాన్యుయేల్‌తో పాటు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. యూ.ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. సొసైటీకి ముఖ్యంగా యూత్‌కు మంచి మెసేజ్ ఇస్తూ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు సెన్సార్ నుంచి ప్రశంసలు వచ్చాయట. సెన్సిటివ్ స్టోరీని రాహుల్ రవీంద్రన్ డీల్ చేసిన విధానం బాగుందని మెచ్చుకున్నట్లు తెలిసింది. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి రొమాంటిక్ సీన్లు, లిప్‌లాక్‌లపై మాత్రం సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. లిప్‌లాక్‌లకు కత్తెర వేసినట్లు టాక్ వినిపిస్తుంది.
మరోవైపు రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే సెలిబ్రిటీల కోసం ది గర్ల్‌ఫ్రెండ్ స్పెషల్ షో వేశారు. ఈ ప్రీమియర్ కు పాజిటివ్ టాక్ వస్తోంది. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకుగాను రష్మిక మందన్నకు నేషనల్ అవార్డు ఖాయమని అంటున్నారు. భూమా పాత్రలో రష్మిక జీవించిందని అంటున్నారు. క్లైమాక్స్‌లో ఇరగదీసిందట. ఆమె యాక్టింగ్, రోల్ గురించి చాలా రోజుల పాటు ఫ్యాన్స్ మాట్లాడుకోవడం ఖాయమని ప్రీమియర్స్ చూసిన వారంతా ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read – Dragon: బీస్ట్ మోడ్‌లో ఎన్టీఆర్ – డ్రాగన్ కోసం యంగ్ టైగర్ రెడీ…
ఇన్నోసెంట్ గర్ల్ నుంచి స్ట్రాంగ్ ఉమెన్‌గా రష్మిక ట్రాన్స్‌ఫర్మ్ అయ్యే తీరు అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. చాలా రోజుల తర్వాత మంచి రోల్‌లో అను ఇమ్మాన్యుయేల్ కనిపించిందని చెబుతున్నారు. రష్మికకు పోటీ పడి దీక్షిత్ శెట్టి నటన సాగుతుందని అంటున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్‌తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని ట్వీట్స్ చేశారు. ఎమోషనల్ స్టోరీని కన్వీన్సింగ్‌గా చెప్పడంలో రాహుల్ రవీంద్రన్ కాస్తంత తడబడిపోయారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హీరోహీరోయిన్ల కాన్‌ఫ్లిక్ట్‌ను దర్శకుడు సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. బోల్డ్ సీన్స్ కొంత ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇబ్బంది పెడతాయట. ఓవరాల్‌గా మాత్రం ప్రీమియర్స్ చూసిన వారంతా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ బాగుందని చెబుతున్నారు.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. తెలుగులో ఈ వారం రిలీజ్ కానున్న ఈ మూవీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 14న విడుదల కానున్నట్లు సమాచారం. ఈ వారం ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు జటాధర, ప్రీ వెడ్డింగ్ షోతో పాటు డబ్బింగ్ సినిమాలు ఆర్యన్, ఫీనిక్స్ విడుదల కాబోతున్నాయి.
Also Read – Allu Arjun: బన్నీ లైనప్ మామూలుగా లేదుగా – అన్ని పాన్ ఇండియన్ సినిమాలే


