The Girlfriend: రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ థియేటర్లలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ మంచి ప్రయత్నంగా ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల మన్ననలను అందుకుంటోంది. రష్మిక మందన్నతో పాటు దీక్షిత్ శెట్టి యాక్టింగ్‌తో పాటు రాహుల్ రవీంద్రన్ టేకింగ్ అద్భుతమంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ది గర్ల్‌ఫ్రెండ్ టాక్ బాగున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం మేకర్స్‌కు గట్టి షాక్ తగిలింది. తొలిరోజు ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ వరల్డ్ వైడ్‌గా కోటి ముప్ఫై లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్లినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాం మినహా మిగిలిన చోట్ల బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీఅంతగా ప్రభావాన్ని చూపించలేకపోయింది.
మౌత్ టాక్‌తో రెండో రోజు అయినా కలెక్షన్స్ పెరుగుతాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగులో 850 వరకు స్క్రీన్స్‌లో ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజైంది. ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో గర్ల్‌ఫ్రెండ్‌కు ఎక్కువగా థియేటర్లు దొరికాయి. కానీ ఆక్యుపెన్సీ రేటు మాత్రం 16 పర్సెంట్ లోపే మాత్రమే ఉంది. చాలా చోట్ల హౌజ్‌ఫుల్స్ కాలేదు.
Also Read – Ananya Panday: జెన్ జీ పై ఫరా ఖాన్, ట్వింకిల్ కౌంటర్స్.. సపోర్ట్‌గా మాట్లాడిన అనన్య పాండే
ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే హీరోయిన్‌గా కనిపించింది రష్మిక. ఆయా సినిమాల్లో హీరో ఇమేజ్‌కు తోడు రష్మిక క్రేజ్ వర్కవుట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టాయి. కానీ ది గర్ల్‌ఫ్రెండ్‌లో రష్మిక మినహా స్టార్ ఎవరూ లేకపోవడంతో కూడా ది గర్ట్‌ఫ్రెండ్ కలెక్షన్స్ తక్కువగా రావడానికి ఓ కారణమైంది.
ది గర్ల్‌ఫ్రెండ్ పాయింట్ బాగున్నా స్లోగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ నెగెటివ్ టాక్‌ను పాజిటివ్‌గా మలిచేందుకు రిలీజ్ తర్వాత కూడా మేకర్స్ భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా థాంక్స్ మీట్‌ను మరో ఒకటి రెండు రోజుల్లో నిర్వహించాబోతున్నారట. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ రాబోతున్నట్లు సమాచారం.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్‌ని రప్పించాలని అనుకున్నారు. విజయ్ బిజీగా ఉండటం, రష్మిక మరో సినిమాకు డేట్స్ కేటాయించడంతో కుదరలేదు. సక్సెస్ మీట్‌పై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుందట. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా కనిపించింది. ఓ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడే క్రమంలో ఓ యువతి ఎదుర్కొనే సంఘర్షణతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీని రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడు ఈ సినిమాను నిర్మించారు.
Also Read – Diwali Movies: ఓటీటీలో సినిమాల వర్షం.. ఒకే రోజు రిలీజ్!


