The Girlfriend: రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో గర్ల్‌ఫ్రెండ్‌పైనే ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్, టీజర్‌తో పాటు పాటలకు మంచి టాక్ వచ్చింది. స్ట్రాంగ్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఉండబోతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్‌తో మేకర్స్ చెప్పేశారు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
కాగా థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం క్లోజయ్యిందట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. రష్మిక మందన్నకు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో మంచి క్రేజ్ ఉండటంతో ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్ని పోటీపడ్డాయట. చివరకు 14 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ నాలుగు కోట్లు, ఆడియో రైట్స్ ద్వారా మరో మూడు కోట్లు వచ్చినట్లు తెలిసింది.
మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతలకు 21 కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. బడ్జెట్‌లో సగానికిపైగా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే రికవరీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా నాన్ థియేట్రికల్ రెవెన్యూతో కలిపి నిర్మాతలు గట్టెక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే పాజిటివ్ టాక్ వస్తే లాభాల పంట పండినట్లేనని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
Also Read – Team India: చరిత్రను తిరగరాశారు – టీమిండియాపై బాలీవుడ్ సెలిబ్రిటీస్ ప్రశంసలు
రష్మిక మందన్న చేసిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇదే. సోలోగా బాక్సాఫీస్ వద్ద రష్మిక ఇమేజ్, స్టామినా, స్టార్‌డమ్ ఎంత మేరకు వర్కవుట్ అవుతాయన్నది గర్ల్‌ఫ్రెండ్‌తో డిసైడ్ కాబోతుంది. ఈ సినిమా హిట్టయితే అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు టాలీవుడ్‌లో రష్మిక మంచి ఛాయిస్‌గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ రిజల్ట్ అటు ఇటు అయినా రష్మిక చేతిలో కమర్షియల్ సినిమాలు భారీగానే ఉన్నాయి కాబట్టి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో దాదాపు ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టారు రాహుల్ రవీంద్రన్. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు.
Also Read – RGV: రమ్యకృష్ణ పోస్టర్ లుక్స్ తో ఒక్కసారిగా పెరిగిన హైప్!


