Rashmika Mandanna Business: నేటితరం హీరోయిన్లు కేవలం యాక్టింగ్‌కే పరిమితం కావడం లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. తమన్నా, సమంత, కత్రినాకైఫ్‌తో పాటు పలువురు టాప్ హీరోయిన్లు సొంతంగా బిజినెస్‌లు స్టార్ట్ చేశారు. సమంత పికిల్‌బాల్ లీగ్ లో ఓ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తోంది. తమన్నా జ్యూవెల్లరీ బిజినెస్ బ్రాండ్ లాంఛ్ చేసింది. యాక్టింగ్‌లోనే కాకుండా బిజినెస్‌లోనూ అదరగొడుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. తాజాగా వీరి బాటలోకి నేషనల్ క్రష్ రష్మిక మందన్న అడుగులు వేసింది. డియర్ డైరీ పేరుతో సొంతంగా పర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని రష్మిక మందన్న స్వయంగా ప్రకటించింది. ఓ వీడియో ద్వారా తన పర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ను అభిమానులకు పరిచయం చేసింది.
ఎగ్జైటింగ్… నెర్వస్…
డియర్ డైరీ ఓ బ్రాండ్, పర్‌ఫ్యూమ్ కాదని, తనలో ఓ భాగమంటూ రష్మిక మందన్న పేర్కొన్నది. సొంత బ్రాండ్‌ను లాంఛ్ చేయడం ఎగ్జైటింగ్‌తో నెర్వస్‌గా ఉందని చెప్పింది. డియర్ డైరీకి అందరి సపోర్ట్ కావాలంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ పెట్టింది. రష్మిక మందన్న డియర్ డైరీ బ్రాండ్ పర్‌ఫ్యూమ్ ధరలు 599 నుంచి 2599 మధ్య ఉన్నాయి. కొత్త బిజినెస్‌ను లాంఛ్ చేసిన రష్మికకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతోన్నారు.
Also Read – HHVM Pre Release Business: ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా!
వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్స్…
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో లక్కీ స్టార్‌గా కొనసాగుతోంది రష్మిక మందన్న. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో దూసుకుపోతుంది. రష్మిక హీరోయిన్‌గా నటించిన యానిమల్,పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి. ఈ ఏడాది రిలీజైన హిస్టారికల్ మూవీ ఛావా కూడా 800 కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. ఇటీవల రిలీజైన కుబేరతో తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసింది. ఈ నాలుగు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించి అభిమానులను మెప్పించింది. రష్మిక నటిస్తే హిట్టే అనే భావన మేకర్స్‌తో పాటు ఫ్యాన్స్‌లో బలపడింది.
ది గర్ల్‌ఫ్రెండ్…
ప్రస్తుతం తెలుగులో ది గర్డ్‌ఫ్రెండ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది రష్మిక మందన్న. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు బాలీవుడ్‌లో థామా పేరుతో ఓ హారర్ మూవీలో నటిస్తుంది రష్మిక.
Also Read – Mithun reddy: ACB కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్లపై ముగిసిన విచారణ


