Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna: దయ చూపండి.. రష్మిక ట్వీట్ వైరల్

Rashmika Mandanna: దయ చూపండి.. రష్మిక ట్వీట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) వరుస సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేర్ చేస్తోంది. ఇటీవలే ‘పుష్ప2’ మూవీతో దుమ్మురేపిన ఈ అమ్మడు.. త్వరలోనే ‘ఛావా’ మూవీతో అలరించనుంది. ఈ మూవీతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. అయితే కొద్దిరోజుల నుంచి ఈ బ్యూటీ లెగ్ పెయిన్‌తో బాధపడుతోంది. ఆమె కాలు కండరాల్లో చీలిక రావడంతో మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది. దీంతో వైద్యులు సర్జరీ చేయడంతో వీల్ చైర్‌కే పరిమితమైంది.

- Advertisement -

తాజాగా సోషల్ మీడియాలో రష్మిక చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని తెలిపింది. అంతేకాకుండా ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించింది. దీంతో ఇలా ఎందుకు ట్వీట్ చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News