Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRashmika to Wayanad: వయనాడ్ బాధితులకు రశ్మిక 10 లక్షల విరాళం

Rashmika to Wayanad: వయనాడ్ బాధితులకు రశ్మిక 10 లక్షల విరాళం

బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియా క్వీన్ గా పేరు తెచ్చుకుంది రశ్మిక మందన్న. సోషల్ ఇష్యూస్ పై స్పందించే రశ్మిక పలు సందర్భాల్లో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాధం పట్ల రశ్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.

- Advertisement -

ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. రశ్మిక మందన్న ప్రస్తుతం “పుష్ప 2” ది రూల్ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ “సికిందర్” లో నటిస్తోంది. ఆమె ఖాతాలో “ది గర్ల్ ఫ్రెండ్” అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad