Mass Jathra New Release Date: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నసినిమా ‘మాస్ జాతర’ (Mass Jathara). ఇప్పటికే విడుదల ఒకట్రెండు సార్లు వాయిదా పడింది. రీసెంట్‌గా ఆగస్ట్ 27న రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న లేటెస్ట్ సమాచారం మేరకు సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. రైటర్ భాను భోగవరపు (Bhanu Bhogavarapu) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ (Sithara Entertainment) బ్యానర్‌పై నాగ వంశీ (Nag Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి, ఇటీవల విడుదలైన టీజర్, పాటలు సినిమా పట్ల అంచనాలను మరింత పెంచాయి.
చాలా రోజులుగా రవితేజకు సరైన హిట్ మూవీ లేదు. ఈసారి ‘మాస్ జాతర’తో హిట్ కొడతాడని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మరోసారి సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్త రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అందుకు కారణం ‘మాస్ జాతర’ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. మరో రెండు పాటలు చిత్రీకరణ జరగాల్సి ఉందని, ప్రస్తుతం సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో షూటింగ్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈ కారణంగానే ‘మాస్ జాతర’ సినిమాని ముందుగా అనుకున్న విధంగా ఆగస్టు 27వ తేదీన విడుదల చేయలేరని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లోనూ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎలాంటి మార్పు చెప్పలేదు.
అక్టోబర్‌లో విడుదల కాబోతోందా?
ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్‌లో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ విడుదల విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే మాత్రం నిర్మాతలు స్పందించాల్సిందే. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల (Sreeleela) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. రవితేజ మరోసారి పోలీస్ యూనిఫాంలో కనిపించబోతున్నారు. ఈసారి ఆయన రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదివరకు రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, అదే సెంటిమెంట్ ‘మాస్ జాతర’ విషయంలో కూడా వర్కవుట్ అవుతుందని, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/coolie-first-day-box-office-collections-record/
రవితేజ, శ్రీ లీల కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా’ (Dhamaka) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ హిట్ జోడీ రిపీట్ కానుంది. మరి ఈ కాంబో హిట్ కొడుతుందా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం దొరకాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/mrunal-thakur-apologizes-to-bipasha-basu-for-body-shaming-comments/


