Mass Jathara : సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఫాలో కావటం కామన్‌గా జరిగే విషయమే. ఎంత పెద్ద స్టార్ అయినా ఏదో ఒక విషయంలో సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. సెంటిమెంట్ మంచిదైతే ఒకే.. కానీ బ్యాడ్ సెంటిమెంట్ అనుకోండి.. కొన్ని పనులు చేయరు. కానీ నేను మాత్రం ఇలాంటివి పట్టించుకోను అని అంటున్నారు రవితేజ. ఈయన కథానాయకుడిగా రూపొందిన ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రమోషన్స్‌లో వేగం పుంజుకుంది. అంతా బాగానే ఉంది. అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఓ విషయంలో కంగారు పడుతున్నారు. ఏంటా విషయం అనే వివరాల్లోకెళ్తే…
రవితేజకు హిట్ వచ్చి చాలా రోజులే అవుతుంది. ఆయన ఫ్యాన్స్ సాలిడ్ హిట్‌తో తమ అభిమాన కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లందరి ఆశలు ‘మాస్ జాతర’పైనే ఉన్నాయి. సినిమాను సమ్మర్‌లో అనుకున్నారు. తర్వాత ఆగస్ట్ రిలీజ్ కూడా అనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో వాయిదా వేసుకుని అక్టోబర్ 31న సందడి చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా రిలీజ్‌కు కొన్ని పాజిటివ్ సైన్స్ కనిపిస్తుంటే.. కొన్ని కంగారు పెట్టే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముందుగా పాజిటివ్ అంశాలకు వెళితే.. ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ, శ్రీలీల జోడీ మరోసారి ఇందులో కనిపించబోతున్నారు. వారిద్దరీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. అందుకు కారణం.. ఆ డేట్ రవితేజకు అన్‌లక్కీ అని వాళ్లు భావిస్తున్నారు. ఎందుకంటే ..2003లో రవితేజ హీరోగా నటించిన వీడే సినిమా అక్టోబర్ 31న రిలీజైంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రవితేజ, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తమిళంలో బ్లాక్ బస్టరైన ధూల్ సినిమాను తెలుగులో వీడేగా రీమేక్ చేస్తే.. ఇక్కడ మాత్రం సో సో రిజల్ట్‌నే రాబట్టుకుంది. ఇప్పుడు మరోసారి అదే డేట్‌కు ‘మాస్ జాతర’ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో కంగారు మొదలైంది.
‘మాస్ జాతర’ రిలీజ్ డేట్‌కే పోటీగా ‘బాహుబలి ది ఎపిక్’ రిలీజ్ అవుతుంది. రెండు బాగాలుగా వచ్చిన బాహుబలిని ఒకే భాగంగా చేసిన రిలీజ్ చేస్తున్నారు. గతంలో లేని కొన్ని సీన్స్‌ను కూడా యాడ్ చేసినట్లు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్. దీంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీంతో మాస్ జాతరకు ‘బాహుబలి ది ఎపిక్’ రూపంలో గట్టి పోటీ ఉందనే చెప్పాలి. మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గత చిత్రం కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేదు. వాళ్లు తెలుగులో రిలీజ్ చేసిన వార్ 2 కూడా గోల్‌ను రీచ్ కాలేదు. దీంతో ‘మాస్ జాతర’తో సక్సెస్ కొట్టి మళ్లీ సక్సెస్ బాట పట్టాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడు. మరి ఈసారి మాస్ మహారాజా అన్ లక్కీసీజన్‌లో హిట్ కొట్టి తనేంటో ప్రూవ్ చేస్తాడా ..లేదా? అనే విషయం తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.


