Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRaviteja: వరుసగా ఐదు ప్లాప్‌లు, "ఇలా అయితే కష్టం" అంటున్న ఫ్యాన్స్!

Raviteja: వరుసగా ఐదు ప్లాప్‌లు, “ఇలా అయితే కష్టం” అంటున్న ఫ్యాన్స్!

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు ఈ ట్యాగ్ లేనప్పుడే హ్యాట్రిక్ హిట్స్ కొట్టేవాడు. ఎప్పుడైతే ఒక మాస్ కమర్షియల్ జోన్‌లో పడిపోయాడో, అప్పటినుంచి ఒకటే సినిమా అన్నట్లుగా కేవలం టైటిల్, హీరోయిన్స్ మాత్రమే మారుతున్నాయి. అప్పట్లో వరుస ప్లాప్స్ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ పేరు, తన అభిమాని అయిన హీరో నితిన్ పేరు ఉండేవి, ఇప్పుడు ఆ లిస్ట్‌లో రవితేజ కూడా చేరినట్టు కనిపిస్తుంది. వరుసగా ఐదు ప్లాప్‌లు.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, ఇప్పుడు మాస్ జాతర…

- Advertisement -

ALSO READ: Peddi : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ మ్యూజికల్ ట్రీట్ ‘చికిరి చికిరి’ వస్తోంది!

‘కిక్’ లాంటి ఒక హిట్ చూసి రవితేజ ఫ్యాన్స్ చాలా రోజులు అయిపోయింది. ఆ మధ్య ‘క్రాక్’, ‘ధమాకా’ కొంచెం పర్వాలేదు అనిపించుకున్నా, రవితేజ గతంలో చూసిన హిట్స్‌తో పోలిస్తే ఇవి ఏమాత్రం అనిపించవు. కొత్త డైరెక్టర్ల పేరుతో అవే పాత చింతకాయ పచ్చళ్ళు. ఒక కొత్త డైరెక్టర్‌తో రవితేజ సినిమా వస్తుంది అంటే, జనాలు ముందే ఫిక్స్ అయిపోతున్నారు, ఇది కూడా ఒక మాస్ కమర్షియల్ సినిమా అని. ఒక అడివి శేష్ లాగా ఒక యూనిక్ పాయింట్‌తో వస్తాడు అని కూడా జనాలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అంటే, తన ఇమేజ్ ఎంత డౌన్ చేసుకున్నాడో అర్థమవుతుంది.

ఇవాళ ఒక రిరిలీజ్ మూవీ అయిన ‘బాహుబలి: ది ఎపిక్’ ముందు బాక్సాఫీస్ దగ్గర ‘మాస్ జాతర’ నిలబడలేక కుదేలవుతోంది. ఒకప్పుడు రాజమౌళి డైరెక్షన్‌లోనే ‘విక్రమార్కుడు’గా చెలరేగిపోయిన రవితేజ, ఇప్పుడు అదే దర్శకుడి రిరిలీజ్ సినిమా ముందు దారుణంగా వెనకడుగు వేయడం చూసి ఫ్యాన్స్ గుండెలు బద్దలవుతున్నాయి. ఇప్పటికైనా ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకుని, మంచి కంటెంట్‌తో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad