MassJathara: రవితేజ సినిమాలు అంటేనే మాస్ జాతరలా ఉంటుంది. ఆయన, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా’ చాలా పెద్ద హిట్ అయింది. అందుకే, వీళ్లిద్దరూ కలిసి చేసిన ఈ కొత్త సినిమా ‘మాస్ జాతర’ మీద అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి. కానీ, రీసెంట్‌గా ట్రైలర్ విడుదలైన తర్వాత, ఆ అంచనాలు కాస్త తగ్గాయి అనే చెప్పాలి.
ట్రైలర్ చూసిన వాళ్లకి వెంటనే అనిపించింది ఏమిటంటే, ఇందులో కొత్తగా ఏమీ లేదు అని. రవితేజ పాత సినిమాల్లో ఉండే ఎలివేషన్లు, విలన్‌తో ఆయన చెప్పే కౌంటర్ డైలాగ్‌లు మళ్లీ అవే రొటీన్‌గా చూపించారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/kantara-chapter-1-ott-release/
కొత్తగా కనిపించిన విషయాలు…
ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం కొత్తగా ఉంది. విలన్‌తో గొడవ పడేటప్పుడు “నేనొచ్చాక ఒకటే జోన్… వార్ జోన్!” అని చెప్పే డైలాగ్ బాగుంది. నవీన్ చంద్ర విలన్ గెటప్ లో కొంచెం కొత్తగా అనిపించాడు. ఒక ఫైట్ మాత్రం ఫుల్ మాస్ గా ఉండబోతుంది అని మాత్రం అర్ధం అయింది. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉండడం వల్ల, వీరిద్దరి కామెడీ టైమింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
నిజానికి, రవితేజ, శ్రీలీల కాంబో అంటేనే ‘ధమాకా’ లాంటి మ్యాజిక్‌ను ఆడియన్స్ ఆశించారు. కానీ, ఈ ట్రైలర్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. ‘ధమాకా’లో ఉన్నట్టుగా, ఈ సినిమాలో ఒక్క సూపర్ హిట్ పాట కూడా లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది.
మొత్తానికి, రవితేజ ఎనర్జీ బాగానే ఉన్నా, కథ, మేకింగ్ పాత ఫార్ములాలో ఉండడంతో… ట్రైలర్ సినిమాకి రావాల్సినంత హైప్‌ను తీసుకురాలేకపోయింది. ఈ సినిమా బాగుండాలంటే, కేవలం రవితేజ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, కథలో కూడా ఏదో ఒక కొత్త విషయం ఉంటేనే బాగుంటుంది.


