Multistarrer: మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ వినడానికే చాలా క్రేజీగా ఉంది!
వీరిద్దరూ కలిసి నటించబోతున్న మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ స్టోరీ ని అందించబోతున్నాడు అని టాక్. ఆయన చెప్పిన ఈ కథ ఇద్దరు హీరోలకి బాగా నచ్చిందట.
రవితేజ ఎనర్జీ, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ కలిస్తే థియేటర్లో నవ్వులకు అడ్డే ఉండదని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ సినిమాకు దర్శకుడు ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఒక యంగ్ డైరెక్టర్‌ను పెట్టాలని చూస్తున్నారట. అంతా కుదిరితే, ఈ సినిమా నుండి అదిరిపోయే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని చెప్పవచ్చు! త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/yash-vs-adivi-sesh-ugadi-2026-box-office-clash/
ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో నవంబర్ 1న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. అలాగే, కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న ‘RT 76’ మూవీతో 2026 సంక్రాంతికి వచ్చే ప్లాన్ లో ఉన్నటు తెలుస్తుంది. నవీన్ పొలిశెట్టి కూడా ‘అనగనగా ఒక రాజు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో 2026 సంక్రాంతి బరిలో రవితేజకు పోటీగా రాబోతున్నాడు. ఈ బిజీ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక, రవితేజ, నవీన్ పొలిశెట్టి మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉంది.


