MASS JATHARA: వాయిదాల పర్వానికి చెక్! మాస్ జాతర అడ్డంకులు దాటి మరీ రంగంలోకి!
మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది! ఈ సినిమా అక్టోబర్ నెల చివరిలో, సరిగ్గా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మాస్ జాతర సృష్టించడానికి సిద్ధమైంది.
వాస్తవానికి ఈ సినిమా ముందే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. కానీ ఆలస్యం అయినా, ఆ మాస్ మజా డబుల్ అవుతుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు! ఆడియో, టీజర్లకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ఫుల్ మీల్స్ తినడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/idli-kottu-great-first-half-half-baked-second-half/
ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్… ధమాకా కాంబినేషన్ రిపీట్!
“మాస్ జాతర” అంటేనే అది రవితేజ కంఫర్ట్ జోన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! డైరెక్టర్ భాను బోగవరపు పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ ఎప్పటిలాగే ఫుల్ ఎనర్జీతో కనిపించబోతున్నాడు.
మరీ ముఖ్యంగా, ‘ధమాకా’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రవితేజ, శ్రీలీల కాంబినేషన్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్! ఈ జోడీ తెరపై కనిపిస్తే రికార్డుల జాతర పక్కా అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దీనికి తోడు భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ని ఊపేస్తోంది.
దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా వాణిజ్య అంశాలతో అసలైన పండుగ సినిమాలా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. ఉత్సాహభరితమైన అవతారంలో రవితేజను చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే అందరూ మెచ్చేలా మాస్ రాజాను చూపిస్తున్నారు దర్శకుడు భాను భోగవరపు. ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న అద్భుతమైన కెమెరా పనితనం, ప్రతి ఫ్రేమ్‌ను గొప్పగా తీర్చిదిద్దే నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. అసలైన పండుగ చిత్రంగా ‘మాస్ జతర’ రూపుదిద్దుకుంటోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/dimple-hayathi-harassment-case-after-dcp-car-controversy/
అక్టోబర్ 31 పండగ గట్టి పోటీలో మాస్ జాతర
ఈ అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ పోరు జరగబోతోంది! ఎన్నో సినిమాలు క్యూలో ఉన్నా, మాస్ మహారాజా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అక్టోబర్ 31కి ఫిక్స్ అయ్యాడు.పండగ సీజన్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుని, అక్టోబర్ 31 నుంచి సినిమా వసూళ్ల జాతర షురూ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ వేశారు.


