Mahadhan: మాస్ మహారాజా రవితేజ కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానే మొదలైంది. క్రిమినల్, ఆజ్ కా గూండరాజ్, నిన్నే పెళ్లాడతాతో పాటు పలు సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు రవితేజ. ఏడీగా పనిచేస్తూనే చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రవితేజ ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్న రవితేజ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
తండ్రి బాటలోనే రవితేజ తనయుడు మహాధన్ అడుగులు వేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రవితేజ తనయుడు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడట. ఈ విషయాన్ని వెంకీ అట్లూరి స్వయంగా వెల్లడించాడు. మాస్ జాతర ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మహాధన్ తన వద్ద ఏడీగా పనిచేస్తున్నట్లు చెప్పాడు.
Also Read – Anaganaga Oka Raju: దీపావళి స్పెషల్ ప్రోమోతో నవీన్ తెగ నవ్వించాడు!
యాక్టింగ్‌తో పాటు దర్శకత్వ విభాగంపై మహాధన్‌కు అవగాహన ఉండాలనే వెంకీ అట్లూరి వద్ద సహాయ దర్శకుడిగా తనయుడిని రవితేజ జాయిన్ చేశాడట. మహాధన్‌కు యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్నట్లు సమాచారం. గతంలో రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ యాక్టర్‌గా మహాధన్ కనిపించాడు. చిన్ననాటి రవితేజ పాత్రలో తళుక్కున మెరిశాడు.
మహాధన్‌తో పాటు రవితేజ కూతురు మోక్షద కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా సూర్యదేవర నాగవంశీ వద్ద తక్షకుడు సినిమాకు పనిచేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. సూర్య, వెంకీ అట్లూరి మూవీని సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్లు రవీనా టాండన్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు అంగీకరించాడు రవితేజ.
Also Read – Kaantha: దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్ ‘కాంత’ రిలీజ్ డేట్ లాక్ అయింది!


