Ravi Teja: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అంగీకరిస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు రవితేజ. తాజాగా మరో కొత్త మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా సెట్టయ్యిందట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని అంటున్నారు. నవంబర్ నుంచి రవితేజ, శివ నిర్వాణ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు వినికిడి. కాంతార చాఫ్టర్ వన్ ఫేమ్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయబోతున్నట్లు చెబుతున్నారు.
రవితేజ సినిమాలు అంటేనే ఫ్యాన్స్ మాస్, కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. కానీ శివ నిర్వాణ మూవీ మాత్రం అందుకు భిన్నంగా రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఉంటుందట. ఇప్పటివరకు సాఫ్ట్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేసిన శివనిర్వాణ… రవితేజ మూవీతో డైరెక్టర్‌గా తన స్టైల్ మార్చబోతున్నట్లు సమాచారం. రవితేజ, శివ నిర్వాణ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ నెలాఖరున లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Also Read – Shri Ramayan Katha: పౌరాణిక పాత్రలో బోల్డ్ బ్యూటీ – దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
స్పెయిన్‌లో షూటింగ్…
ప్రజెంట్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ స్పెయిన్ షెడ్యూల్‌తో సినిమాకు గుమ్మడికాయ కొట్టి ఇమ్మిడియేట్‌గా శివ నిర్వాణ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు రవితేజ.
భర్త మహాశయులకు విజ్ఞప్తి…
కిషోర్ తిరుమల మూవీకి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్, ఫన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో భాను భోగవరపు డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో రవితేజ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
Also Read – Digital Payments : ఇకపై ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు !


