Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభRavi Teja: 'మనదే ఇదంతా' అంటున్న రవితేజ.. మాస్ లుక్ అదిరిపోయిందిగా..

Ravi Teja: ‘మనదే ఇదంతా’ అంటున్న రవితేజ.. మాస్ లుక్ అదిరిపోయిందిగా..

Ravi Teja| మాస్ మహారాజా రవితేజ అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. దీపావళి పండుగ కానుకగా రవితేజ 75వ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

- Advertisement -

రవితేజ కటౌట్‌కు తగ్గట్లు ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టారు. ‘మనదే ఇదంతా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో రవితేజ మాస్ లుక్ అదిరిపోయింది. చేతిలో గంట.. నడుములో తుపాకీ పెట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవి సరసన యూత్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా మే9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2022లో వచ్చిన ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల జోడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల రవితేజ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో తన కెరీర్‌లోనే మైలు రాయి అయిన 75వ చిత్రంతో బ్లాక్‌బాస్టర్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News