Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో వారసత్వ ధోరణి ఎక్కువగానే కనిపిస్తుంటుంది. వారసత్వంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టే వారిలో చాలా మంది యాక్టింగ్‌పైనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హీరోల కొడుకులు హీరోలుగా పరిచయం కావడం కామన్. కానీ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతోంది. స్టార్ హీరోల తనయులు కొంతమంది దర్శకులుగా పరిచయం అవుతున్నారు. కొడుకులను మాత్రమే కాకుండా కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు స్టార్ హీరోలు ఏ మాత్రం వెనుకాడటం లేదు. యాక్టర్లుగానే కాకుండా ప్రొడక్షన్, డైరెక్షన్ లాంటి విభాగాల్లో హీరోల కూతుళ్లు అదరగొడుతున్నారు.
రవితేజ ఫ్యామిలీ నుంచి వారసులు చాలా మందే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఫస్ట్ టైమ్ ఓ వారసురాలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు సినిమాల్లోకి అడుగుపెట్టబోతుంది. అయితే హీరోయిన్ కాదండోయ్. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా అరంగేట్రం చేస్తోంది.
Also Read – EXAM ALERT: ఇంటర్ విద్యార్థులకు ‘అలర్ట్’.. వారం ముందుగానే వార్షిక పరీక్షలు!
తక్షకుడు ఓటీటీ…
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ తక్షకుడు పేరుతో ఓ సినిమాను నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తక్షకుడు మూవీకి రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిందట. సినిమా నిర్మాణం పట్ల మోక్షదకు ఇంట్రెస్ట్ ఎక్కువేనట. భవిష్యత్తులో ప్రొడ్యూసర్‌గా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. నిర్మాణపరమైన వ్యవహారాల్లో అనుభవం కోసం సూర్యదేవర నాగవంశీ వద్ద తక్షకుడు మూవీకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా మోక్షద పని చేసినట్లు చెబుతున్నారు.
రాజా ది గ్రేట్ మూవీ…
రవితేజ కొడుకు మహాధన్ కూడా సినిమాల్లో నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్ననాటి రవితేజ పాత్రలో కనిపించాడు. తండ్రి బాటలోనే మహాధన్ హీరోగా మారనున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.
మాస్ జాతర రిలీజ్ ఎప్పుడంటే?
కాగా రవితేజ హీరోగా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 27 రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ డిలే వల్ల వాయిదా పడింది.
Also Read – Ananya Panday: అనన్య అదిరిపోయే అందాలు చూడతరమా..


