Raviteja: రిజల్ట్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ కొత్త సినిమాలపై సంతకాలు చేస్తున్నారు రవితేజ. ప్రస్తుతం మాస్ మహారాజా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బింబిసార, విశ్వంభర సినిమాల దర్శకుడు వశిష్ట మల్లిడితో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. రొటీన్ కమర్షియల్ స్టోరీలు అంతగా వర్కవుట్ కాకపోవడంతో వశిష్ట మల్లిడి మూవీతో రవితేజ తన రూటును మార్చబోతున్నట్లు చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ మూవీ తెరకెక్కనుందట. మాస్ మహారాజా స్టైల్ కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఆల్‌మోస్ట్ పూర్తయ్యిందట. తుది మెరుగులు దిద్దే ప్రయత్నాల్లో డైరెక్టర్ ఉన్నట్లు చెబుతున్నారు.
వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించిన విశ్వంభర వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తర్వాతే రవితేజ మూవీ సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. విశ్వంభర మూవీలో చిరంజీవి హీరోగా నటించారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగుల కారణంగా రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో విశ్వంభర మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.
Also Read – Anjaan Re Release: సమంత డిజాస్టర్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్
మరోవైపు ఇటీవలే మాస్ జాతర మూవీతో ప్రేక్షకలు ముందుకొచ్చారు రవితేజ. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, క్రాక్‌తో పాటు రవితేజ గత సినిమాలతో పోలికలు రావడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
మాస్ జాతర రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం కిషోర్ తిరుమల మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రవితేజ. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో ఆషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు రవితేజ. అలాగే నవీన్ పొలిశెట్టితో ఓ మల్టీస్టారర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
Also Read – ChatGPT : భారతీయ యూజర్లకు OpenAI బంపర్ ఆఫర్


