Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRavi Teja: షూటింగ్ పూర్త‌వ్వ‌లేదు.. అప్పుడే థియేట్రిక‌ల్, ఓటీటీ బిజినెస్ క్లోజ్.. ఫ్లాపులున్నా ర‌వితేజ క్రేజ్‌కు...

Ravi Teja: షూటింగ్ పూర్త‌వ్వ‌లేదు.. అప్పుడే థియేట్రిక‌ల్, ఓటీటీ బిజినెస్ క్లోజ్.. ఫ్లాపులున్నా ర‌వితేజ క్రేజ్‌కు ఢోకాలేదు!

Ravi Teja: ర‌వితేజ హిట్టు అందుకొని మూడేళ్లు దాటిపోయింది. ధ‌మాకా త‌ర్వాత అత‌డు హీరోగా న‌టించిన రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుతో పాటు ఈగ‌ల్‌, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్ ర‌వితేజ కెరీర్‌తో పాటు అత‌డి మార్కెట్‌పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించ‌లేదు. రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా న‌టించిన మాస్ జాత‌ర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ‌రో రెండు సినిమాలు ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉన్నాయి. వీటిలో ర‌వితేజ, కిషోర్ తిరుమ‌ల మూవీ ఒక‌టి.

- Advertisement -

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న 76వ మూవీ ఇది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను జూన్‌లో నిర్వ‌హించారు. అదే నెల నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

ర‌వితేజ, కిషోర్ తిరుమ‌ల మూవీ షూటింగ్‌ను అక్టోబ‌ర్ నెలాఖ‌రుక‌ల్లా కంప్లీట్ చేసి సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా షూటింగ్ కంప్లీట్ కాక‌ముందే ఈ సినిమా థియేట్రిక‌ల్‌తో పాటు ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు జీ నెట్‌వ‌ర్క్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. థియేట్రిక‌ల్ బిజినెస్ గ‌ట్టిగానే జ‌రిగింద‌ట‌. అన్ని ఏరియాల హ‌క్కులు అమ్ముడుపోయిట్లు స‌మాచారం. సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత‌లు లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు చెబుతోన్నారు.

Also Read – Onam Special: బొద్దుగా ముద్దొస్తున్న నివేదా థామస్

ర‌వితేజ కిషోర్ తిరుమ‌ల మూవీకి అనార్క‌లితో పాటు స‌త్తిబాబు ప‌ర‌లోక యాత్ర అనే టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. త్వ‌ర‌లోనే టైటిల్‌తోపాటు ఫ‌స్ట్‌లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌.

మాస్ జాత‌ర రిలీజ్ డేట్ ఇదే…
కాగా ర‌వితేజ మాస్ జాత‌ర మూవీ ఆగ‌స్ట్ 27న రిలీజ్ కావాల్సింది. కానీ కార్మికుల స్ట్రైక్ వ‌ల్ల షూటింగ్ డిలే అయ్యింది. దానికి తోడు వార్ 2 రిజ‌ల్ట్ ఎఫెక్ట్ కూడా సినిమాపై ప్ర‌భావాన్ని చూపింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ క‌న్ఫామ్ చేసిన‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ 31న ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ విడుద‌ల కానున్న‌ట్లు చెబుతోన్నారు. మాస్ జాత‌ర మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read – This Week Movies: ఈ వారం ప్రేక్షకుల ముందుకు మిరాయ్‌తో పాటు మరెన్నో.. ఈ సినిమాలపై ఓలుక్కేయండి..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad