Bhartha Mahaashayulaku Vignapthi: ఇటీవలే మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రవితేజ. ఈ సినిమా రిలీజై పది రోజులు కాకముందే ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ అందించారు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫన్ ఫ్యామిలీ డ్రామా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ వీడియో గ్లింప్స్‌ను సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రవితేజ సినిమా అంటేనే మాస్, యాక్షన్, పంచ్ డైలాగ్స్‌తో కూడి ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా సాఫ్ట్ కామెడీతో భర్త మహాశయులకు విజ్ఞప్తి గ్లింప్స్ సాగింది. రవితేజ జోవియల్ క్యారెక్టర్‌లో సెటిల్డ్‌గా కనిపించారు.
ఈ సినిమాలో రామసత్యనారాయణ అనే పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు వీడియో గ్లింప్స్‌లో చూపించారు. నా జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ప్రయత్నించాను. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లను.. ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్ల అడక్కూడదని, పెళ్లైనా వాళ్లకు నా లాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ… మీ రామసత్యనారాయణ చెప్పిది ఏంటంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటుంది. గ్లింప్స్‌తో పాటు సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read – Ashika Ranganath: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఆషికా
రవితేజ హీరోగా నటిస్తున్న 76వ మూవీ ఇది. ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రవితేజ, ఆషికా రంగనాథ్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుందట. కాగా రిలీజ్‌కు ముందే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. జీ5 ప్లాట్‌ఫామ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా.. జీతెలుగు శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.
మూడేళ్ల తర్వాత డైరెక్టర్‌గా భర్త మహాశయులకు విజ్ఞప్తితో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు కిషోర్ తిరుమల. ఈ సినిమా కంటే ముందు కిషోర్ తిరుమల చేసిన ఆడాళ్లు మీకు జోహార్లు, రెడ్ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. మరోవైపు రవితేజ హిట్టు అందుకొని మూడేళ్లు దాటిపోయింది. దాంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ రవితేజతో పాటు డైరెక్టర్ కిషోర్ తిరుమలకు కీలకంగా మారింది.
Also Read – Donald Trump: అమెరికన్లు ఎగిరి గంతేసే వార్త.. ప్రతి ఒక్కరికి 2 వేల డాలర్లు..!


