Ravi Teja: రవితేజ హిట్టు కొట్టి రెండేళ్లు దాటిపోయింది. ధమాకా తర్వాత రవితేజ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా మాస్ మహారాజా క్రేజ్ తగ్గలేదు. ఆఫర్లకు కొదవలేదు. డిజాస్టర్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాడు రవితేజ.
మాస్ జాతర రిలీజ్…
రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
షూటింగ్ కంప్లీట్…
మాస్ జాతర తర్వాత డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ జూన్‌లో లాంఛ్ అయ్యింది. మూడు నెలల్లోనే షూటింగ్ 90 శాతం వరకు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారట. అక్కడే రెండు పాటలతో పాటు కొంత టాకీ పార్ట్‌ను చిత్రీకరించనున్నారు. ఈ స్పెయిన్ షెడ్యూల్‌తో రవితేజ, కిషోర్ తిరుమల షూటింగ్ మొత్తం పూర్తి కానుందట.
Also Read – Triangle Love Story: ముక్కలైన కళ్యాణ్ గుండె.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా?
భర్త మహాశయులకు విజ్ఞప్తి…
రవితేజ హీరోగా నటిస్తున్న 76వ మూవీ ఇది. కాగా ఈ సినిమాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భార్య కారణంగా ఇబ్బందులు పడే భర్తగా ఈ మూవీలో రవితేజ ఫన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. రవితేజ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొనే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే పేరును పెట్టినట్లు చెబుతున్నారు.
ఇద్దరు హీరోయిన్లు…
ఈ మూవీలో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే షూటింగ్‌ను చకా చకా షినిష్ చేశారు. డిసెంబర్ నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.
ఐదు సినిమాలు…
అయితే ఇప్పటికే సంక్రాంతి రేసులో చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు, ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఉన్నాయి. వీటితో పాటు జననాయగన్, పరాశక్తి వంటి డబ్బింగ్ సినిమాలు సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఐదు సినిమాలకు పోటీగా రవితేజ, కిషోర్ తిరుమల మూవీ రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది త్వరలో డిసైడ్ కానుంది.
మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. కిషోర్ తిరుమల మూవీ షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ శంకర్ సినిమా సెట్స్‌పైకి రానుంది.
Also Read – RISHAB SHETTY: రిషబ్ శెట్టి రియల్ స్టోరీ ఒక్క షో కోసం వేడుకున్న డైరెక్టర్.’కాంతార’ జాతర!


