Raviteja: రవితేజ బ్యాడ్‌టైమ్ కంటిన్యూ అవుతోంది. భారీ అంచనాల నడుమ రిలీజైన మాస్ జాతర కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. మాస్ జాతర మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. పెద్ద బ్యానర్ నిర్మించిన సినిమా కావడం, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మాస్ జాతరతో రవితేజ హిట్టు కొట్టడం ఖాయమని అభిమానులు భావించారు. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా పట్టుమని వారం కూడా థియేటర్లలో నిలబడలేదు. 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు అతి కష్టంగా యాభై శాతం వరకు రికవరీ సాధించింది. నిర్మాతలకు మాస్ జాతర మూవీ భారీగానే నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. మాస్ జాతర రిజల్ట్‌తో సంబంధం లేకుండా రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. నాలుగు సినిమాలు చేస్తున్నాడు.
వరుస డిజాస్టర్లతో రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. మొన్నటివరకు ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చాడు రవితేజ. మాస్ ఆడియెన్స్‌లో రవితేజకు ఉన్న ఇమేజ్ కారణంగా థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ బిజినెస్‌లు బాగానే జరగడంతో నిర్మాతలకు కూడా మాస్ మహారాజా డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇస్తూ వచ్చారు. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ కూడా మొన్నటివరకు తగ్గలేదు. మాస్ జాతర రిజల్ట్‌తో సీన్ మొత్తం మారిపోయింది.
Also Read – Kushboo: గౌరీ కిషన్ బాడీ షేమింగ్ వివాదం – 96 హీరోయిన్‌కు ఖుష్బూ సపోర్ట్
కిషోర్ తిరుమల మూవీతో పాటు శివ నిర్వాణ సినిమాల కోసం రవితేజ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. రెమ్యూనరేషన్ బేసిస్‌లో కాకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో సినిమాలు చేయాలని ఫిక్సైయ్యారట. కేవలం అడ్వాన్స్ మాత్రమే నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న రవితేజ… సినిమా రిలీజై లాభాలు వస్తేనే రెమ్యూనరేషన్ ఇవ్వమని నిర్మాతలకు చెబుతున్నాడట.
ఈ ప్లానింగ్ గనక సక్సెస్ అయితే తదుపరి సినిమాల విషయంలో ఇదే రూట్‌ను ఫాలో అవ్వాలని మాస్ మహారాజా నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహేష్‌బాబుతో పాటు మరి కొంతమంది టాలీవుడ్ హీరోలు ప్రాఫిట్ షేరింగ్ విధానంలో సినిమాలు చేశారు. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మూవీలో ఆషికా రంగనాథ్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డింపుల్ హయతి స్పెషల్ సాంగ్ చేసినట్లు సమాచారం. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్‌తో రవితేజ ఓ సినిమా ఫిక్సయ్యింది. నవీన్ పొలిశెట్టితో మల్టీస్టారర్ చేయబోతున్నాడు. రవితేజ, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట మల్లిడి కాంబినేషన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా రాబోతుంది.
Also Read – Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పెళ్లి – డేటింగ్ మాత్రం మరొకరితో – రష్మిక కామెంట్స్ వైరల్


