Kalki 2 Movie: ప్రభాస్ కల్కి 2 మూవీ నుంచి దీపికా పడుకోణె తప్పుకోవడం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. కల్కి 2లో దీపికా పడుకోణె భాగం కాదంటూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ గురువారం ఓ ట్వీట్ పెట్టింది. కల్కి 2898 ఏడీలాంటి సినిమా చేయాలంటే ఎంతో నిబద్ధత అవసరం అంటూ ఇన్‌డైరెక్ట్‌గా దీపికా పడుకోణెపై సెటైర్లు వేసినట్లు కనిపిస్తోంది. కల్కి 2 నుంచి దీపికా పడుకోణె తప్పుకోలేదని, తప్పించారని చాలా మంది నెటిజన్లు వైజయంతీ మూవీస్ ట్వీట్‌ను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు.
ఆషామాషీ కాదు…
దీపికా పడుకోణెతో షూటింగ్ అంటే ఆషామాషీ కాదని, ఎన్నో కండీషన్లు, డిమాండ్లను ప్రొడ్యూసర్ల ముందు పెడుతుందని అంటున్నారు. దీపికా ట్రబుల్ మేకర్‌గా మారడంతోనే ఆమెతో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు సైతం వెనుకడుగు వేస్తున్నారని చెబుతున్నారు. కల్కి 2 నుంచి కూడా ఆమెను తప్పించడానికి అవే డిమాండ్లు కారణమట.
రెమ్యూనరేషన్ హైక్…
కల్కి పార్ట్ వన్ కోసం దీపికా పడుకోణె 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట. పార్ట్ వన్ హిట్టవ్వడంతో సీక్వెల్ కోసం 25 శాతంఎక్కువ రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు మిగిలిన యాక్టర్లు మాత్రం పార్ట్ 1 టైమ్‌లో ఒప్పుకున్న రెమ్యూనరేషన్‌కే సినిమా చేయడానికి అంగీకరించారని, కానీ దీపికా మాత్రం రెమ్యూనరేషన్ పెంచాలని పట్టుపట్టినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. 25 నుంచి 30 కోట్ల వరకు ఇవ్వాలని అడిగిందట.
రోజు ఏడు గంటలే…
దీపికా పడుకోణె షూటింగ్ టైమ్‌లో రోజుకు ఏడు గంటలు మాత్రమే పనిచేస్తానని కండీషన్ పెట్టిందట. ఎక్కువ గంటలు పనిచేయడానికి సెట్‌లో ఓ లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఏర్పాటుచేస్తామని నిర్మాతలు చెప్పిన దీపికా పదుకోణ్ మాత్రం తన కండీషన్ విషయంలో వెనక్కి తగ్గలేదని అంటున్నారు. దీపికా షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌తో ఆమెతో పాటు టీమ్ 25 మంది కూడా వస్తారట. వారందరికి ఫైవ్‌స్టార్ భోజనం, వసతి ఖర్చులను కూడా నిర్మాతలే భరించాలని దీపికా చెప్పిందట.
స్పిరిట్ నుంచి….
దీపికా డిమాండ్స్ విని చిత్రబృందం షాకైనట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ కండీషన్లకు ఒప్పుకొని సినిమా చేయాలంటే అనుకున్నదానికంటే బడ్జెట్ రెట్టింపు అవుతుందనే ఆలోచనతో దీపికా దీపికా పడుకోణెను నిర్మాతలు పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి డిమాండ్స్ వల్లే స్పిరిట్ నుంచి కూడా సందీప్ వంగా దీపికా పడుకోణెను తప్పించినట్లు సమాచారం. కాగా కల్కి 2లో దీపికా పడుకోణె పాత్రలో ఎవరికి ఎంపికచేస్తారన్నది ఫ్యాన్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.
కల్కి 2 మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు. కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read – Bigg Boss Captain: ఎంత పనైపాయే పవనూ..మాటలు వినవ్ అని రీతూ అనేసిందిగా.. కెప్టెన్సీ టాస్క్ లో ఆ నలుగురు


