Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభRenu Desai: కుమారుడితో కలిసి చండీ హోమం చేసిన రేణు దేశాయ్

Renu Desai: కుమారుడితో కలిసి చండీ హోమం చేసిన రేణు దేశాయ్

Renu Desai| సినీ నటి రేణూదేశాయ్(Renu Desai) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఆమెకు దైవ భక్తి కూడా ఎక్కువే. దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇటీవల తన నివాసంలో భక్తి శ్రద్ధలతో గణపతి చండీ హోమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

‘‘శరద్‌ పూర్ణిమ సందర్భంగా గణపతి, చండీ హోమం నిర్వహించాం. మన సంస్కృతిలో శరద్‌ పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులుగా మన ఆచారాల ప్రాముఖ్యతను, పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలి’’ అని ఈ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే పూజలు చేసే సమయంలో ఎలాంటి ఆర్భాటాలకు పోవద్దని.. ప్రశాంతతో కూడిన భక్తిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఆమె సినిమాల విషయానికొస్తే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాస్ మహారాజా నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రలో నటించి మెప్పించారు. మరికొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News