ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu desai)ల కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) వస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. పవన్ నటిస్తున్న ఓజీ సినిమా ద్వారా అకీరా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందించారు. తన తనయుడి ఎంట్రీ కోసం అందరి కంటే ఎక్కువగా తాను కూడా ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు సినిమాల్లోకి వస్తాడని తెలిపారు.
ఇక గోదావరి జిల్లాల్లో ఉన్నంత అద్భుతమైన లొకేషన్లు తాను ఎక్కడా చూడలేదన్నారు. విజయవాడ – రాజమహేంద్రవరం మధ్య పచ్చని పొలాలు చూసి మనసు ఆనందంతో నిండిపోయిందని తెలిపారు. సినిమా షూటింగ్స్ ఈ ప్రాంతాల్లో జరగాలనే ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి ఆమె మద్దతు తెలిపారు. సినిమాల్లోకి రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఇదంతా విధి రాత అని చెప్పుకొచ్చారు. కాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో అకీరా ఇప్పటికే న్యూయార్క్‌లోని ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.