Darshan: కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ కేసు విచారణ ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో విచారణ వేగంగా పూర్తి చేసి దర్శన్‌కు మరణశిక్ష విధించినా తనకి సమ్మతమేనని ఆయన న్యాయవాది చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/dhruv-vikram-confirmed-his-dating-with-anupama-parameswaran/
మరణశిక్షపై గందరగోళం…
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో ‘మరణశిక్ష’ ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా, ఒక సందర్భంలో విచారణ జరుగుతున్నప్పుడు ఒక గుర్తుతెలియని వ్యక్తి కోర్టు హాలులోకి చొరబడి “హీరో దర్శన్‌కు మరణశిక్ష విధించాలి” అని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, జైలులో కష్టాలు పడుతున్న దర్శన్ కూడా ఒకసారి కోర్టు ఎదుట భావోద్వేగానికి లోనై, “నాకు సైనేడ్ ఇవ్వండి”, ఇలా బతకలేను” అని అభ్యర్థించినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనల కారణంగానే మరణశిక్షపై చర్చ మొదలైనట్లుగా తెలుస్తోంది.
ఈ కేసు విచారణ తరచుగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిగా సెప్టెంబర్ 9న జరిగిన విచారణలో దర్శన్ విషం కావాలని కోరిన తరువాత, కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 19కి వాయిదా పడింది. అయితే, ఇప్పుడు మళ్లీ అక్టోబర్ 29కి వాయిదా పడినట్లు తెలుస్తుంది.


