Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRGV : నాకెందుకు దండేశారో అర్ధం కావట్లేదు.. ఆర్జీవీ ట్వీట్..

RGV : నాకెందుకు దండేశారో అర్ధం కావట్లేదు.. ఆర్జీవీ ట్వీట్..

- Advertisement -

RGV : ఒకప్పుడు సినిమాలతో సంచలనాలు సృష్టించిన ఆర్జీవీ, ఇప్పుడు సంచలన ట్వీట్స్ తో రచ్చ చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలపై తనదైన స్టైల్ లో ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. అవి కాస్తా వైరల్ గా మారతాయి. అయితే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో పాటు కాసింత నవ్వు కూడా తెప్పిస్తుంది.

ప్రస్తుతం ఆర్జీవీ ఏపీ రాజకీయాలకి సంబంధించి వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాత దాసరి అరుణ్ కుమార్. ఇటీవల దాసరి అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో ఆర్జీవీ పాల్గొన్నాడు.

ఈ వేడుకల్లో అక్కడున్న పలువురు ఆర్జీవికి పెద్ద పూల దండ వేశారు. ఆ ఫోటోని ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. మా ‘వ్యూహం’ప్రొడ్యూసర్‌ దాసరి కిరణ్‌ కుమార్‌ గారి బర్త్‌డేకి నాకెందుకు దండేశారో నాకర్థం కాలేదు. వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే టు దాసరి కిరణ్‌’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News