Chiranjeevi RGV Issue : తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘శివ’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసించారు. చిరంజీవి ఈ సినిమాపై ఇచ్చిన హృదయపూర్వక వీడియో మెసేజ్‌ను షేర్ చేస్తూ, తన తొలి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని “విప్లవం”గా అభివర్ణించిన మెగాస్టార్‌కు థాంక్స్ చెప్పారు. అయితే, అనుకోకుండా చిరంజీవిని బాధపెట్టి ఉంటే క్షమించమని ఆర్జీవీ కోరారు. ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయంశంగా మారింది.
Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT
— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025
‘శివ’ (1989) ఆర్జీవీ తొలి డైరెక్షన్ మూవీ. నాగార్జున హీరోగా, ఇలయరాజా సంగీతం, అమలా, రఘువరణ్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చింది. హీరో సైకిల్ చైన్ లాగిన సీన్, కెమెరా యాంగిల్స్, లైటింగ్, సౌండ్ – అంతా అద్భుతం. ఆ రోజుల్లో అభిమానులను ఈ సినిమా ఉర్రూతలూగించింది. ఇక ఈ సినిమాపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. “ఈ సినిమాలో నాగార్జున యాక్టింగ్ ఫెంటాస్టిక్. ప్రతి క్యారెక్టర్ చిత్రానికి ప్రాణం పోసింది. ఆర్జీవీ విజన్ గురించి ప్రముఖంగా చెప్పాలి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తుగా మారాడు” అని మెగాస్టార్ కొనియాడారు.
ఇక ఈ పోస్ట్ పై స్పందించిన ఆర్జీవీ, “థాంక్స్ చిరంజీవి గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. విశాల హృదయంతో మా టీమ్‌ని విష్ చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.” అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


