Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRISHAB SHETTY: రిషబ్ శెట్టి రియల్ స్టోరీ ఒక్క షో కోసం వేడుకున్న డైరెక్టర్.'కాంతార' జాతర!

RISHAB SHETTY: రిషబ్ శెట్టి రియల్ స్టోరీ ఒక్క షో కోసం వేడుకున్న డైరెక్టర్.’కాంతార’ జాతర!

KANTARA JOURNEY: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ స్టోరీస్ చాలా చూసుంటాం. కానీ.. కన్నీళ్లను దాటి, అవమానాలను పక్కన పెట్టి సాధించిన విజయం మాత్రం ఎప్పుడూ బ్లాక్‌బస్టర్ హిట్టే! ఒకప్పుడు తన ఆరాధ్య దైవం చిరంజీవి సినిమాలో చిన్న వేషం వేసిన రవితేజ.. కొన్నేళ్లకే ఆయనతో కలిసి నటించడం ఒక స్ఫూర్తి అయితే.. కన్నడ సినీ సంచలనం రిషబ్ శెట్టి ప్రయాణం ఏకంగా ఒక పాఠం!

- Advertisement -

ప్రస్తుతం ‘కాంతార ఏ లెజెండ్’ చాప్టర్ 1 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రిషబ్ శెట్టి.. ఈ వైభవం వెనుక ఎవరూ ఊహించని ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ దాగి ఉంది.

ఒక్క షో దొరికితే.. అదో అవార్డులా ఫీలై!

దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రయాణం 2016లో ‘రిక్కీ’ అనే సినిమాతో మొదలైంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. థియేటర్ల దగ్గర అసలు సమస్య మొదలైంది.
నాటి దయనీయ పరిస్థితి: సినిమాకు తగినన్ని షోలు దొరకలేదు. ఆడియన్స్ రావడానికి ఛాన్స్ లేకుండా, స్క్రీనింగ్‌లు ఇవ్వకుండా థియేటర్ల యాజమాన్యం రిషబ్‌ను ముప్పు తిప్పలు పెట్టింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rag-mayuri-vimal-krishna-anumana-pakshi-movie/

ఒకే ఒక్క షో: చివరికి.. బెంగళూరులోని ఒక పెద్ద మల్టీప్లెక్స్‌లో సాయంత్రం వేళ ఒక్క షో ఇవ్వడానికి ఒప్పుకుంటే.. రిషబ్ పొందిన సంతోషం అంతా ఇంతా కాదు! అది ఏదో జాతీయ అవార్డు వచ్చినంత సంబరంగా భావించి, వెంటనే ఆ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసుకున్నాడు. ఒక్క షో దొరికితే అంత తపన, సంతోషం!

5000 థియేటర్లు.. టికెట్ లేదు! ఇది కదా కిక్!

ఏడు సంవత్సరాలు తిరిగేసరికి కథ పూర్తిగా మారిపోయింది! రిషబ్ శెట్టి కష్టం.. ఇప్పుడు సింహాసనం ఎక్కి కూర్చుంది.

ఇప్పుడు ఆయన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా.. దేశవ్యాప్తంగా 5000కు పైగా థియేటర్లలో ఆడుతోంది! ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. షోలు కాదు, ఏకంగా టికెట్లే దొరకని స్టేజీకి రిషబ్ చేరుకున్నాడు!

ALSO READ: https://teluguprabha.net/cinema-news/is-rukmini-going-to-replaced-rashmika/

ఆ రోజు ఒక్క షో కోసం పడిన వేదన.. నేడు వేల షోల విజయంతో తీరిపోయిందని, ఈ రియల్ కిక్ ఎంతో గొప్పదని రిషబ్ స్వయంగా తన పాత ట్వీట్‌ను గుర్తు చేసుకుంటూ చెప్పడం.. ప్రతి సినీ ప్రేమికుడికి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

‘కాంతార’ లాంటి అద్భుత కళాఖండం అతని ప్రతిభకు నిదర్శనం.
‘కిరిక్ పార్టీ’తో రికార్డులు సృష్టించి, జాతీయ అవార్డు గెలిచి, ఇప్పుడు సాంకేతికంగా బలమైన దర్శకుడిగా, నటుడిగా మెప్పిస్తున్న రిషబ్ శెట్టి.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. ఈ మౌత్ టాక్ కొనసాగితే.. ‘కాంతార చాప్టర్ 1’ కూడా మరో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad