Kantara Chapter 1: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందనతో బాక్సాఫీస్ దగ్గర రాణిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.717 కోట్ల వసూళ్లను వరల్డ్ వైడ్ సాధించింది. ఈ వారాంతంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినిమా సాధించిన ఈ భారీ సక్సెస్ పట్ల రిషబ్.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంతే కాకుండా మన దేశంలోని పురాతన, ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గుడులకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటున్నారు. కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్న ఆయన గంగాహారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, నిరంతరం పూజలు జరిగే హిందూ దేవాలయంగా భావించే ముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అమ్మవారి పట్టాభిషేక పూజలో కూడా రిషబ్ పాల్గొని, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణంలో సమయాన్నిగడిపారు. ‘కాంతార చాప్టర్ 1’ మన దేశ సంస్కృతి సంప్రాదాయాలను ఆధారంగా చేసుకుని వాటి విశిష్టతను చాటేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సాధించిన విజయానికి చిహ్నంగా ఇటీవల ముంబైలో సిద్ధి వినాయక ఆలయంతో పాటు, చాముండేశ్వరి ఆలయానికి కూడా వెళ్లారు.
Sanatan 🚩🙏#RishabShetty attends Ganga aarti and seeks divine blessings on his spiritual visit to Varanasi.@shetty_rishab expressed his thanks and gratitude to Maa Ganga for #KantaraChapter1’s massive success. 🙌 pic.twitter.com/Meu9Rsls0f
— Ashwani kumar (@BorntobeAshwani) October 17, 2025
2022లో కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’లో రిషబ్ హీరోగా నటిస్తే రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు.
Also Read – Deepavali 2025: ఆ ఊరిలో దీపావళి పండుగ జరుపుకోరట.. శాపమే కారణమా!


