Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభKantara Chapter 1: రిషబ్ శెట్టి టార్గెట్ రూ.1000 కోట్లు.. వంద కోట్ల మార్క్ దాటిన...

Kantara Chapter 1: రిషబ్ శెట్టి టార్గెట్ రూ.1000 కోట్లు.. వంద కోట్ల మార్క్ దాటిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది. 2022లో విడుదలై, పాన్ ఇండియా వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ‘కాంతార’ చిత్రానికి ఈ మూవీ ప్రీక్వెల్. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా.. విడుదల సమయంలో ముందుగా నెగటివ్ టాక్‌తో ప్రారంభమైనప్పటికీ, తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుని దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా మూవీ న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

- Advertisement -

రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్
‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. తొలి రోజున అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలుపుకుని ఈ చిత్రం రూ.89 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు విషయానికి వస్తే, ఈ పీరియాడిక్ డ్రామా ఏకంగా రూ.45 కోట్లు నెట్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో కేవలం రెండు రోజుల్లోనే సినిమా రూ.106 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రన్ అవుతోన్న థియేటర్లలో 82.31 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. అంతేకాకుండా ఆట ఆటకు ఆక్యుపెన్సీ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న హైప్‌ను బట్టి చూస్తే, ఈ వారాంతానికి సినిమా నెట్ కలెక్షన్స్ రూ.200 కోట్ల మార్కును దాటుతుందని అందరూ భావిస్తున్నారు.

Also Read- SS Thaman: లక్కీ డేట్ సెంటిమెంట్.. ది రాజాసాబ్‌కి కలిసొస్తుందా?

ప్రశంసలు..
దర్శకుడు, హీరో అయిన రిషబ్ శెట్టి ఈ చిత్రం కోసం ప్రత్యేకించి భారీ సెట్‌లు వేయడంతో పాటు, వందకోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు. రిషబ్ శెట్టితో పాటు ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విజయానికి ముఖ్య కారణాల్లో ఒకటి అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్. ఇది సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఈ చిత్ర విజయాన్ని టాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, ఆర్జీవీ సహా సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ప్రముఖులు అప్రిషియేట్ చేశారు.

రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా?
‘కాంతార చాప్టర్ 1’ మేకర్స్ ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేయాలని చాలా ధీమాతో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తుంటే, ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ మూవీ కచ్చితంగా రూ.500 కోట్లకు పైగానే రాబడుతుందని చెబుతున్నారు. 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా వసూళ్లKantaraను సాధించిన నేపథ్యంలో, దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’.. రూ.1000 క్లబ్‌లో చేరుతుందో లేదో చూడాలి మరి. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా న్యూ రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది.

Also Read- IND VS AUS: రో-కో వచ్చేస్తున్నారోచ్.. ఆస్ట్రేలియాతో వన్డేలకు జట్టు ఎంపిక ఇవాళే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad