Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ వన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా నిలిచింది. కన్నడంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో నిర్మాతలకు భారీగా లాభాల పంటను పండించింది. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన కాంతార చాప్టర్ వన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. లెజెండ్ కంటిన్యూస్ అంటూ కాంతార చాప్టర్ వన్ పోస్టర్‌ను ట్విట్టర్ ఖాతాలో అమెజాన్ ప్రైమ్ పోస్ట్ చేసింది. అక్టోబర్ 31 లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కాంతార చాప్టర్ వన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు.
మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. 2022లో రిలీజై పెద్ద హిట్టైన కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ వన్‌ను రిషబ్ శెట్టి రూపొందించారు. 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్పటివరకు 920 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ వంద కోట్లకుపైగా కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న డబ్బింగ్ మూవీగా కాంతార చరిత్రను తిరగరాసింది. 2025లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డును కూడా కాంతార చాప్టర్ వన్ బ్రేక్ చేసింది.
Also Read – Hyderabad: నగర వాసులకు బిగ్ అలర్ట్.. 18 గంటలు నీటి సరఫరా బంద్!
కాంతార చాప్టర్ వన్‌లో రిషబ్ శెట్టి యాక్టింగ్‌తో పాటు డైరెక్టర్‌గా అతడి టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ అద్భుతమంటూ ఆడియెన్స్ నుంచే కాకుండా సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్స్ వినిపించాయి. కాంతార చాప్టర్ వన్ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. కాంతార చాప్టర్ వన్ మూవీ ఇంగ్లీష్‌లోకి డబ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాంతార చాప్టర్ వన్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది.
కాంతార, కాంతార చాప్టర్ వన్ బ్లాక్‌బస్టర్స్‌తో తెలుగులో స్ట్రెయిట్ హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం తెలుగులో జై హనుమాన్‌తో పాటు మరో మూవీ అంగీకరించాడు.
Also Read – AI Education : సర్కారు బడుల్లో ఏఐ‘పాఠాలు’.. కంప్యూటర్లు లేక ‘గుణపాఠాలు’!


