Saturday, November 15, 2025
HomeTop StoriesKantara Chapter 1: రెండు వారాల్లో ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. హిట్ కోసం ఎంత...

Kantara Chapter 1: రెండు వారాల్లో ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. హిట్ కోసం ఎంత రావాలంటే!

Kantara Chapter 1: రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడమే కాక, దర్శకుడిగా రూపొందించిన చిత్రమే ‘కాంతార చాప్టర్ 1’. భారీ అంచనాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. తొలి వారంలోనే రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమా విడుద‌లై ఇప్ప‌టికి రెండు వారావ‌ల‌వుతుంది. ఈ రెండు వారాల్లో సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు భాష‌ల్లో (తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌) ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.717 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. షేర్ ప‌రంగా చూస్తే ఈ వ‌సూళ్లు రూ.350 కోట్ల‌కు పైచిలుకుగా ఉంటుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ అంటున్నాయి.

- Advertisement -

హిందీ విష‌యానికి వ‌స్తే నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా ఇప్ప‌టికే రూ.185 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్‌సీస్‌లోనూ సినిమా వంద కోట్ల మార్క్ దాటేసింది. ఈ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా క‌లెక్ష‌న్స్ వ‌ర‌ల్డ్ వైడ్ ఈ వారాంతానికి బ్రేక్ ఈవెన్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వ‌స్తే ‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి రూ.105 కోట్లు గ్రాస్‌.. అంటే రూ.65 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. తెలుగులో సినిమా బిజినెస్ రూ.90 కోట్లు జరిగింది. సో.. ఇక్క‌డ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.25 కోట్ల మేర‌కు రావాల్సి ఉంది. మ‌రి ఆ క‌లెక్ష‌న్స్ వ‌స్తుందో.. రాదో చెప్ప‌లేరు. ఎందుకంటే ఇప్ప‌టికే సినిమా విడుద‌లైన రెండు వారాలు దాటేసింది. ఆడియెన్స్ ఇక సినిమాను చూడ‌టానికి థియేట‌ర్స్‌కు వ‌స్తారంటే క‌ష్ట‌మే మ‌రి. వ‌చ్చినా రూ.50 కోట్లు గ్రాస్ వ‌చ్చేలా అంటే ఆలోచించాల్సిన విష‌య‌మే మ‌రి.

Also Read – Prabhas: ప్రభాస్ డబుల్ ట్రీట్, అక్టోబర్ 23 & అక్టోబర్ 31!

ఈ కథకు నాల్గవ శతాబ్దంలో క‌న్న‌డ ప్రాంతాన్ని పాలించిన కదంబ వంశం కాలాన్ని డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టి ఎంచుకున్నాడు. ఆ యుగానికీ, ఆ సంస్కృతికీ తగినట్లు విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి భారీ సెట్‌లు వేసి అత్యంత రిచ్‌గా చిత్రీకరించారు. సినిమా నిర్మాణానికి హోంబలే ఫిల్మ్స్ రూ.125 కోట్ల బడ్జెట్ ఖ‌ర్చు పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఈ చిత్రంలో రిషబ్ శెట్టి పక్కా నటనతో ఆకట్టుకోగా, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), జయరాం, గుల్షన్ దేవయ్య తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కథ, కథన పద్ధతి, విజువల్స్, సంగీతం అన్నింటిలోనూ కాంతార చాప్టర్ 1 ఒక కొత్త ట్రెండ్ సెట్ట‌ర్ అని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

Also Read – Siddhu Jonnalagadda: ‘తెలుసు కదా’ మూవీ రివ్యూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad