Rishab Shetty: ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమాను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ సూపర్ హిట్ వెనుక ఉన్న హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పడిన కష్టం మామూలుది కాదు. సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక విషయం అస్సలు తెలియదు. అదేంటంటే, క్లైమాక్స్‌లో వచ్చే ముఖ్యమైన పాత్రను చేసింది రిషబ్ శెట్టినే! ఈ విషయం సినిమా చూస్తున్నపుడు చాల మందికి తెలియదు.
Enti idi Rishab Shetty aa 😮😮 didn't notice that 🙏🙏 #Kantara pic.twitter.com/VSDcL0raI6
— Dhanush🧛 (@Always_kaNTRi) October 27, 2025
ALSO READ: https://teluguprabha.net/cinema-news/vamsi-paidipally-pawan-kalyan-new-movie-update/
6 గంటలు మేకప్‌లోనే కూర్చోవడం!
‘కాంతార చాప్టర్ 1’ లో చివర్లో వచ్చే ‘మాయకరా’ అనే ముసలి పాత్ర వేషం వేసుకున్నది రిషబ్ శెట్టినే ముఖ్యంగా ‘మాయకరా’ ముసలి పాత్రలో ఆయన మొహానికి వేసిన ప్రత్యేక మేకప్ వల్ల, ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అంటే, ఆయన ఆ పాత్రలో ఎంత బాగా ఇమిడిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టమైన పాత్ర వేసుకుని, అదే సమయంలో రిషబ్ శెట్టి సినిమాకు దర్శకత్వం కూడా చేశాడు. ఆ భారీ మేకప్‌తోనే, సెట్‌లో ఏది కరెక్ట్, ఏది తప్పు అని చెబుతూ, సినిమాను నడిపించాడు.
రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం పెట్టిన కష్టం, చూపించిన శ్రద్ధ వల్లే ‘కాంతార’ ప్రపంచమంతా చేరింది. సినిమాపై తన ప్రాణం పెడితే, ఎలాంటి అద్భుతం చేయొచ్చో రిషబ్ శెట్టి చేసి చూపించాడు.


