Rishabh Shetty: కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ మూవీగా ఈ కన్నడ సినిమా చరిత్రను సృష్టించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ వంద కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార, కాంతార చాప్టర్ వన్ విజయాలతో తెలుగులో రిషబ్ శెట్టికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతడికి పోటీ పడి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అడ్వాన్స్‌లు ఇచ్చేశారు.
ప్రస్తుతం తెలుగులో జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు రిషబ్ శెట్టి. హనుమాన్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సీక్వెల్‌తోపాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రిషబ్ శెట్టి ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ పాన్ ఇండియన్ మూవీపై మాస్ జాతర ప్రమోషన్స్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. రిషబ్ శెట్టితో చేయబోతున్నది తెలుగు సినిమా కాదని స్ట్రెయిట్ కన్నడ మూవీ అని చెప్పాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి రిషబ్ శెట్టి మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఫస్ట్ కన్నడ మూవీ ఇది. ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్‌గా నాగవంశీ శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాంతార చాప్టర్ వన్ తరహాలోనే కన్నడంలో ఈ సినిమాను రూపొందించి తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. సూర్య – వెంకీ అట్లూరి మూవీతో తమిళంలోనూ తన లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు సూర్యదేవర నాగవంశీ.
దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో సూర్య మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. స్ట్రెయిట్ తమిళ మూవీ ఇదని టాక్ వినిపిస్తోంది. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ యాభై శాతం వరకు పూర్తయ్యింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.
గత కొన్నాళ్లుగా నాగవంశీ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2ను తెలుగులో నాగవంశీ రిలీజ్ చేశారు. ఈ సినిమా అతడికి భారీగా నష్టాలను మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన కింగ్డమ్ కూడా పరాజయాన్నే మూటగట్టుకుంది.
Also Read – AUS vs IND: టీమ్‌ఇండియాకు షాక్: అభిషేక్ శర్మ ఔట్


