Monday, March 10, 2025
Homeచిత్ర ప్రభRobinhood: రాబిన్ హుడ్ నుంచి 'అదిదా సర్‌ప్రైజ్' వచ్చేసింది

Robinhood: రాబిన్ హుడ్ నుంచి ‘అదిదా సర్‌ప్రైజ్’ వచ్చేసింది

యూత్ స్టార్ నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్ హుడ్'(Robinhood) అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఛలో, భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా మూవీలోని ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

- Advertisement -

‘అదిదా సర్‌ప్రైజ్’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో హాట్ హీరోయిన్ కేతికశర్మ అందాలు అరబోసింది. మల్లెపూలు కప్పుకొని పాటలో హాట్ హాట్ స్టెప్పులతో సెగలు పుట్టిస్తోంది. ఈ పాటకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాట పాడగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ చేశారు. కాగా ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News