Yash Mother Pushpa Viral Video: పాన్ ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్ప ఈ మధ్యే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ‘కొత్తలవాడి’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 1న కన్నడనాట విడుదల అయింది. అయితే దురదృష్టవశాత్తు, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. యశ్ తల్లి పుష్ప చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదానికి దారి తీసి ఆమెను వార్తల్లో నిలిపాయి.
‘కొత్తలవాడి’ సినిమా విడుదలకు ముందు పుష్ప సినిమా ప్రమోషన్స్‌లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అంతా తానై ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రమోషనల్ కార్యకలాపాల్లో భాగంగా ఆమె ప్రముఖ కన్నడ హీరోయిన్ దీపికా దాస్‌పై చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పుష్ప మాట్లాడుతూ ‘దీపికా దాస్ పెద్ద హీరోయిన్ కాదు.. చిత్ర పరిశ్రమలో ఆమె ఏం సాధించింది?’ అని ప్రశ్నించింది. పుష్ప చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో కాస్తా కాంట్రవర్సీకి దారి తీసి సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణమైంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/actor-naresh-vk-new-home-video-goes-viral/
పుష్ప చేసిన ఈ వివాదాస్పద కామెంట్లపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారు ‘తీసింది ఒకే ఒక సినిమా. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంత దురహంకారం ఉండకూడదు. అది మంచిది కాదు’ అంటూ ఆమెను తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా, ‘యశ్ ఎక్కడున్నాడు?’ అని ప్రశ్నిస్తూ, ఈ వివాదాన్ని హీరో యశ్ మెడకు చుట్టేశారు. సోషల్ మీడియాలో ఈ రచ్చ అటు తిరిగి, ఇటు తిరిగి యశ్‌ను చిక్కుల్లో పడేసింది. కొంతమంది నెటిజన్లు ఈ పరిస్థితికి యశ్‌నే నిందిస్తున్నారు. మరికొంతమంది అయితే, ‘యశ్ తన తల్లితో ఈ విషయం గురించి మాట్లాడాలి. లేకపోతే ఆమె రానున్న రోజుల్లో మరిన్ని కామెంట్లు చేసే అవకాశం ఉంది. అప్పుడు గొడవ మరింత పెద్దది అవుతుంది’ అని అభిప్రాయపడుతున్నారు. యశ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై కలత చెందుతున్నారు. తమ అభిమాన నటుడు తల్లి కారణంగా విమర్శల పాలు అవుతున్నాడని వారు బాధపడుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/tamannaah-bhatia-green-signal-to-bollywood-movie-ragini-mms-3/
మొత్తంమీద ఈ గొడవ ఆపడానికి యశ్ ఇప్పుడు ఏం చేస్తాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ మొత్తం వ్యవహారం యశ్‌పై తీవ్రమైన ఒత్తిడిని పెంచింది. అతను ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. ఈ వివాదం ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


