Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభRRR: ఆస్కార్ బరిలో మరో అడుగు ముందుకేసిన ఆర్ఆర్ఆర్!

RRR: ఆస్కార్ బరిలో మరో అడుగు ముందుకేసిన ఆర్ఆర్ఆర్!

RRR: తిరుగులేని విజయాలు అందుకుని పాన్ ఇండియా దర్శకుడిగా మారిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో అతడి స్ఠాయి మరింత పెరిగిన సంగతి తెలిసిందే. కాగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. అధికారికంగా ఈ సినిమా మన దేశం నుండి వెళ్లకపోయినా.. For Your Consideration (FYC) అనే క్యాంపెయిన్ ద్వారా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు.

- Advertisement -

థియేటర్లలో ఆడిన సినిమాలను ఆస్కార్స్‌కు కన్సిడర్ చేయడానికి పంపమని ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ కోరింది. దీంతో ఈ క్యాంపైన్ ద్వారా ఆస్కార్ వరకు వెళ్ళింది. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు వెళ్తుందని ప్రచారం జరుగుతుందే కానీ.. ఎలా ఏ కేటగిరీ అన్నది క్లియర్ కాలేదు. అయితే, ఇప్పుడు ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ మరో అడుగు పడిందట.

ఆస్కార్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకుందట. ఈ సినిమాలో నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎంపికైంది. దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఆస్కార్ గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, ఇండియా నుండి ఆస్కార్ ఎంట్రీకి అర్హత సాధించిన ఛెల్లో షో కూడా ఈ షార్ట్ లిస్టులో ఉంది. మరి మన సినిమాలు ఆస్కార్ సాధించి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకోవాలని మనమూ ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News