Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభRajamouli : వరుసగా మరో రెండు హాలీవుడ్ అవార్డులు గెలుచుకున్న RRR..

Rajamouli : వరుసగా మరో రెండు హాలీవుడ్ అవార్డులు గెలుచుకున్న RRR..

- Advertisement -

Rajamouli : RRR సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లకి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా టేకింగ్ విషయంలో రాజమౌళిని టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అంతా పొగిడేస్తున్నారు. RRR సినిమాని హాలీవుడ్ వాళ్ళు మాత్రం ఆకాశానికెత్తేస్తున్నారు. రాజమౌళిని అభినందిస్తున్నారు.

ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న రాజమౌళి RRR సినిమాని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. అలాగే హాలీవుడ్ లో అంతా రాజమౌళి గురించి గొప్పగా చెప్తున్నారు. ఇప్పటికే RRR సినిమా, రాజమౌళి పలు హాలీవుడ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా మరో రెండు అవార్డులని గెలుచుకున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా RRR సినిమాకి మరో రెండు అవార్డులు రాగా వాటి గురించి అధికారికంగా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్ర యూనిట్. RRR సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే స్పాట్‌లైట్ అవార్డును గెలుచుకుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 24న లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే HCA ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. అలాగే అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌ లో RRR సినిమా ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News