Ruhani Sharma: చిలసౌ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలవడమే కాకుండా నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాలో రుహానీ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ ది ఫస్ట్ కేస్‌తో మరో బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది రుహానీ.
ఈ విజయాలతో తెలుగులో రుహానీకి అవకాశాలు బాగానే వచ్చాయి. డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, సైంధవ్‌తో పాటు శ్రీరంగనీతులు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ ఇవేవీ రుహానీకి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి. ఈ డిజాస్టర్లతో టాలీవుడ్‌కు దూరమైంది. రుహానీ శర్మ తెలుగులో సినిమా చేసి ఏడాదిపైనే అవుతోంది.
తాజాగా ఈ చిలసౌ హీరోయిన్ బంపరాఫర్ అందుకుంది. తెలుగు సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార పేరుతో రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుహానీ శర్మ ఛాన్స్ కొట్టేసింది. పూజాహెగ్డే, శృతిహాసన్‌తో పాటు మరికొందరు టాప్ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మేకర్స్ రుహానీ శర్మను ఫైనల్ చేశారట. ఆకాశంలో ఒకతార మూవీలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించబోతున్న విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.. మాస్క్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రివీల్ చేశాడు. ఆకాశంలో ఒక తార మూవీలో రుహానీ శర్మతో పాటు సాత్విక వీరవల్లి అనే కొత్త అమ్మాయి కూడా మరో నాయికగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Nara Lokesh MLAs Issue : “కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్లను చూసి నేర్చుకోండి” – నారా లోకేష్ ఫైర్!
ఆకాశంలో ఒక తార మూవీని స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్‌తో కలిసి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆకాశంలో ఒక తార మూవీపైనే రుహానీ ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్‌లో బిజీ కావాలని ఆశపడుతోంది.
తమిళంలో మాస్క్ మూవీ చేస్తోంది రుహానీ శర్మ. కెవిన్, ఆండ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 21న రిలీజ్ కాబోతుంది. మాస్క్ మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది రుహానీ శర్మ.
Also Read – Gayatri Bhardwaj: ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్న రవితేజ హీరోయిన్


