Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRukmini Vasanth In Kantara: Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’లో రుక్మిణి వసంత్ లుక్.....

Rukmini Vasanth In Kantara: Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’లో రుక్మిణి వసంత్ లుక్.. కనకవతిగా రాజసం

Rukmini Vasanth First Look in Kantara: Chapter 1: 2023లో విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ (Kanatara) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి భారీ వసూళ్లను సాధించింది. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించటంతో పాటు హీరోగా నటించారు. రూ.16 కోట్ల మేరకు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ను (Kantara Collections) సాధించింది. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాఫర్ట్1’ (Kantara: Chapter 1) రూపొందుతోంది.

- Advertisement -

ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న కాంతార చాప్టర్ 1 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి హోంబలే ఫిల్మ్స్ సన్నాహాలు చేస్తోంది. కాంతారలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రీక్వెల్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కనకవతి అనే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. ఆమె లుక్ రాజసంతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కనకవతి పాత్ర సినిమా కథలో కీలక స్థానాన్ని సంపాదించుకోనుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Also Read – 2026 Sankranti Releases: మారుతున్న సంక్రాంతి లెక్క‌లు

కాంతార చాప్టర్1 కోసం ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు సినీ సర్కిల్స్ టాక్. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేసి మరీ చిత్రీకరణను చేశారు. ఈసారి రిషబ్ శెట్టి పాత్ర ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఇది పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషల్లో విడుదల చేస్తారు. దీనికి పార్ట్ 3 కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కెజియఫ్, సలార్, మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘కాంతారా: చాప్టర్ 1’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం కాంతార సాధించిన కలెక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రీక్వెల్ లెక్కలు మారిపోయాయని అంటున్నాయి.

Also Read – The Paradise First Look: ‘జడల్‌’గా నేచురల్ స్టార్.. ‘ది ప్యారడైజ్‌’.. ఇప్పటి వరకు చూడని సరికొత్త ఫస్ట్ లుక్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad