Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRUKMINI VASANTH: రుక్మిణి వసంత్ ఆరు ఫ్లాపుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్!

RUKMINI VASANTH: రుక్మిణి వసంత్ ఆరు ఫ్లాపుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్!

RUKMINI VASANTH: ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ దక్కించుకున్న హీరోహీన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ, ఆ విజయం తర్వాత వరుసగా ఆరు ప్లాప్స్ ఎదురైనా ఏడవ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్‌.

- Advertisement -

హీరోయిన్ అంటే గ్లామర్ కాదు, నటన

రుక్మిణి వసంత్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా ‘సప్త సాగరాలు దాటి ‘సైడ్ ఎ’, ‘సైడ్ బి’. ఈ సినిమా కన్నడలో పెద్ద హిట్టైనా, తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ భాషల్లో అనుకున్నంత విజయం దక్కలేదు. కానీ, ఈ చిత్రంలో ఆమె పోషించిన ‘సింధు’ పాత్ర మాత్రం ప్రతి ఒక్కరి మనసునూ గెలుచుకుంది.కేవలం ఆమె కోసమే చాలా మంది సీక్వెల్‌ను చూశారంటే అతిశయోక్తి కాదు.ఈ సినిమా ఆమె జాతకాన్ని మార్చేస్తుందని అంతా భావించారు. అవకాశాలు కూడా క్యూ కట్టాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/balayya-dual-role-in-nbk-111/

తన ప్లాప్ లతో ఫాన్స్ కూడా విసిగిపోయారు.

స్టార్‌డమ్ వచ్చిన ఉత్సాహంలో రుక్మిణి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ‘సప్త సాగరాలు దాటి’ తర్వాత ఆమెకు గట్టి ఎదురుదెబ్బలు తగిలియాయి. ఏకంగా అర డజనుకు పైగా సినిమాలు నిరాశపరిచాయి.

వరుసగా ఫ్లాపులైన సినిమాలు

కన్నడంలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో చేసిన ‘బాణాదారియల్లి’ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ప్రశాంత్ నీల్ కథ అందించిన శ్రీమురళి చిత్రం ‘బఘీరా’ కూడా తేడా కొట్టింది. శివరాజ్ కుమార్ సినిమా ‘భైరతి రానగల్’ డబ్బింగ్‌లో డిజాస్టర్ అయ్యింది. విజయ్ సేతుపతి ‘ఏస్’, శివ కార్తికేయన్ ‘మదరాసి’ సైతం అపజయాల జాబితాలో చేరాయి. ఇక నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ గురించి అయితే ప్రేక్షకులకు పెద్దగా తెలియనే లేదు.
ఒక్కసారిగా ఆకాశం నుండి నేలపై పడినట్టు అనిపించినా, రుక్మిణి వసంత్ మాత్రం వెనుకడుగు వేయలేదు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/f1-movie-celebrates-100-das-success/

‘కనకవతి’ రూపంలో బ్లాక్‌బస్టర్ బ్రేక్

ఇన్ని చేదు జ్ఞాపకాల తర్వాత రుక్మిణి వసంత్‌కు ఊహించని విజయాన్ని అందించిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ మూవీలో ఆమె పోషించిన ‘కనకవతి’ పాత్ర అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణ హీరోయిన్‌ పాత్రలా కాకుండా, సినిమా సెకండాఫ్‌లో డిఫరెంట్ యాంగిల్ లో, ఊహించని షేడ్స్‌తో కూడిన పాత్రలో రుక్మిణి నటన అద్భుతం. ఆర్టిస్టుగా అన్ని రకాల ఛాలెంజింగ్ పాత్రలు చేయగలనని ఆమె ఈ సినిమాతో నిరూపించుకున్నారు. ఏదేమైనా, రుక్మిణి వసంత్ ఫిల్మోగ్రఫీలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది.

తర్వాత రాబోతూన్న ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా స్టార్

ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కనుక విజయవంతమైతే, ఆమె కెరీర్ మరో మలుపు తిరిగినట్టే. అవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా, రాకింగ్ స్టార్ యష్ సినిమా ‘టాక్సిక్’.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad