మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’. “మనదే ఇదంతా” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి, భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ధమాకా’ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత మరోసారి ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు.
ఇందులో రవితేజ సీఆర్పీఎఫ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకోగా.. ఇటీవల ‘సూపర్ డూపర్’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల డాన్స్ మాస్్‌ని ఉర్రూతలూగిస్తోంది. ‘ధమాకా’ సక్సెస్‌కి సాంగ్స్ ఓ ప్రధాన కారణం. మళ్ళీ, ‘మాస్ జాతర’ మూవీ సాంగ్స్ విషయంలోనూ అదే అనిపిస్తోంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/boyapati-balakrishna-akhanda-tandavam-blasting-roar/
భీమ్స్ అందిస్తున్న సంగీతం సినిమాకి మేజర్స్ ప్లస్ పాయింట్ అని సాంగ్స్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా, ఈ నెల 27న ‘మాస్ జాతర’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ ద్వారా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే చిత్రానికి సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. తాజాగా ఆ అప్డేట్‌ని కూడా టీం ఇచ్చింది. యూ/ఏ సర్టిఫెకెట్‌ని పొందిన ఈ మూవీ 160 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రవితేజ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా దర్శకులు రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ళ వరకూ ప్రతీ ఒక్కరూ చూసేలా పూర్తి వినోదాత్మక చిత్రంగా దర్శకుడు భాను తెరకెక్కించారు. ఈ మధ్య కాలంలో అటు రవితేజకి గానీ, ఇటు శ్రీలీలకి గానీ మంచి కమర్షియల్ హిట్ లేదు. కాబట్టి, వీరిద్దరికీ ‘మాస్ జాతర’ హిట్ చాలా కీలకంగా మారింది. చూడాలి మరి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్‌ని తెచ్చుకుంటుందో. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు.


